బాలయ్యది ఆ పాత్ర కాదంట..!

బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలయ్య ఓ మూవీ చేయనున్నాడు. మార్చి 28న ఈ సినిమా లాంచ్ కానుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో [more]

Update: 2019-03-13 07:47 GMT

బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలయ్య ఓ మూవీ చేయనున్నాడు. మార్చి 28న ఈ సినిమా లాంచ్ కానుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో షూటింగ్ లేట్ అయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ 11న ఎలక్షన్స్ కాబట్టి మే నుండి సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశముందని టాక్. అయితే ఇందులో బాలయ్య రెండు పాత్రలతో ఎంటర్టైన్ చేయనున్నాడు. ఒక పాత్రలో రాజకీయ నాయకుడిగా కనిపించనున్నాడని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఇందులో ఏ మాత్రం నిజం లేదని ఈ సినిమా కేవలం ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో సాగే పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ అని చెబుతున్నారు.

ఇద్దరికీ హిట్ అవసరం

ఈ సినిమా హిట్ అవ్వడం బోయపాటికి, బాలయ్యకు చాలా అవసరం. ఎందుకంటే ఇద్దరికీ డిజాస్టర్స్ ఉన్నాయి. బోయపాటి ‘వినయ విధేయ రామ’, బాలయ్య ‘కథానాయకుడు’ మరియు ‘మహానాయకుడు’ డిజాస్టర్స్ అందుకున్నారు. అయితే గతంలో వీరి కాంబినేషన్ లో రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కాబట్టి మూడోసారి కూడా ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమా హిట్ అవుతుందని భావిస్తున్నారు.

Tags:    

Similar News