బాలయ్య – బోయపాటి సినిమాపై ఇన్ని గాసిప్సా…?

నిన్నటి నుండి బాలకృష్ణ – బోయపాటి కాంబో ఆగిపోయిందని.. అందుకే ఈ సినిమా అప్ డేట్ ఇవ్వడానికి వెనకాడుతున్నారనే న్యూస్ నడిచింది. బాలకృష్ణ ప్రస్తుతం హిందూపూరం ఎమ్మెల్యేగా [more]

Update: 2019-04-27 06:44 GMT

నిన్నటి నుండి బాలకృష్ణ – బోయపాటి కాంబో ఆగిపోయిందని.. అందుకే ఈ సినిమా అప్ డేట్ ఇవ్వడానికి వెనకాడుతున్నారనే న్యూస్ నడిచింది. బాలకృష్ణ ప్రస్తుతం హిందూపూరం ఎమ్మెల్యేగా పోటీ చేసి దాని రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే బోయపాటితో సినిమాని ఎప్పుడో ఎనౌన్స్ చేసిన బాలయ్య.. అది మొదలు పెట్టడానికి చాలా టైం తీసుకుంటున్నాడు. ఇక జూన్ నుండి మొదలవుతుందని అనుకుంటున్న బోయపాటి – బాలయ్యల సినిమా ఆగిపోయిందనే న్యూస్ నడుస్తున్నప్పటికీ… ఇప్పుడు ఆ సినిమా మీద మళ్లీ రకరకాల వార్తలు వినబడుతున్నాయి. ఎప్పటినుండో బోయపాటి సినిమాలో బాలకృష్ణ రెండు గెటప్స్ లో కనిపిస్తాడని న్యూస్ గతంలో ప్రచారం జరిగినట్టుగానే.. ఇప్పుడు కూడా ఆ ప్రచారం జోరుగా మొదలైంది. బోయపాటి బాలయ్యతో ఆగష్టు నుండి సెట్స్ మీదకు వెళ్తాడని.. ముందు నుండి అనుకున్నట్టుగానే ఈ సినిమాలో బాలయ్య రెండు గెటప్స్ లో కనిపిస్తాడని.. అందులో ఒక గెటప్ కు కాస్త గుబురు గెడ్డం వుంటుందని టాక్.

విగ్ వద్దు.. అసలైన గడ్డం…

కథానాయకుడు, మహానాయకుడు సినిమాల తర్వాత బాలయ్య ఎన్నికలు, రాజకీయాల్లో పడి శరీరాకృతి పట్టించుకోలేదని… ప్రస్తుతం చాలా లావుగా ఉండడంతో కాస్త బరువు తగ్గిన తరువాతే ఈ సినిమా ప్రారంభిస్తారని కూడా వినిపిస్తోంది. ఇక గుబురు గెడ్డం లుక్ కోసం బాలకృష్ణ ఒరిజినల్ గెడ్డం పెంచితే బాగుంటుందని.. విగ్గు వాడకుండా నేచురల్ గా గెడ్డం పెంచాలని బోయపాటి బాలయ్యని కోరినట్లుగా కూడా వార్తలొస్తున్నాయి. ఇకపోతే బోయపాటి – బాలయ్య సినిమా ప్రీ ప్రొడక్షన్ కి ఎక్కువ టైం పట్టడం వల్లనే సినిమా మొదలవడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది అని అంటున్నారు.

Tags:    

Similar News