బాధ్యతంతా బాలయ్యదే..!

బాలకృష్ణ తండ్రి జీవితచరిత్రని తెరకెక్కించి చేతులు కాల్చుకోవడమే కాదు.. ఎన్టీఆర్ కి ఉన్న గౌరవాన్ని కథానాయకుడు, మహానాయకుడుగా అంటూ రెండు పార్టులతో మొత్తం పోగెట్టేసాడు. ఎన్టీఆర్ మీదున్న [more]

Update: 2019-02-25 07:13 GMT

బాలకృష్ణ తండ్రి జీవితచరిత్రని తెరకెక్కించి చేతులు కాల్చుకోవడమే కాదు.. ఎన్టీఆర్ కి ఉన్న గౌరవాన్ని కథానాయకుడు, మహానాయకుడుగా అంటూ రెండు పార్టులతో మొత్తం పోగెట్టేసాడు. ఎన్టీఆర్ మీదున్న అభిమానం, గౌరవం అన్నీ ఈ ఎన్టీఆర్ బయోపిక్ తో అభిమానుల్లో తుడిచిపెట్టుకుపోయిందేమో అనిపించేలా ఉంది. కథానాయకుడు డిజాస్టర్ కాగా, మహానాయకుడు కలెక్షన్స్ ఇంకా దారుణంగా ఉన్నాయి. ఎన్టీఆర్ అంటే తెలుగు ప్రజల ఆరాధ్య దైవం. అలాంటి వ్యక్తిని బయోపిక్ పేరుతొ బజారుకు ఈడ్చారన్నట్టుగా ఉంది ఈ వ్యవహారం. అయితే ఇదంతా బాలకృష్ణ స్వయంకృతాపరాధంగానే అనిపిస్తుంది. ఎందుకంటే కథానాయకుడు సినిమాని ఎన్టీఆర్ ని దైవంగా చూపించినా… ఎన్టీఆర్ మీద చేసిన భజన భరించలేక ప్రేక్షకులు ఆ సినిమాని తిప్పికొట్టారు.

ఎన్టీఆర్ కాదు… చంద్రబాబే హీరో

మరి మహానాయకుడు అయినా బాగా తియ్యాల్సింది పోయి… బాలకృష్ణ ఈ సినిమాలో బావ చంద్రబాబు భజన చూపించాడు. ఎన్టీఆర్ ని హీరోగా చూపించాల్సింది పోయి.. బావ చంద్రబాబు భజన చేయించడంతో ప్రేక్షకులు మాత్రమే కాదు.. నందమూరి అభిమానులు కూడా ఈ సినిమాని తిప్పికొట్టారు. అసలు టిడిపికి ఫేవర్ గా ఉంటుందనే ఒకే ఒక్క విషయంతో చాలామంది ఈ సినిమా చూడలేదు అంటే నమ్మాలి. మరి అందుకే మహానాయకుడుకి అంత దారుణమైన ఓపెనింగ్స్ వచ్చాయి. టీడీపీకి, చంద్రబాబుకి ఫేవర్ గా మహానాయకుడు చిత్రాన్ని తీసి 2019 ఎన్నికల్లో గెలవాలనుకుంటే ఫలితం ఎలా ఉందో చూసారుగా… మరి ఇదంతా క్రిష్ తప్పుకాదు.. బాలయ్య చెప్పింది చేశాడు క్రిష్. క్రిష్ అనుకున్నది వేరు. కానీ బాలకృష్ణ చెప్పింది చెయ్యకపోతే.. క్రిష్ కి ఇబ్బంది కనకనే.. ఇలా బాలయ్య చెప్పింది చేసి క్రిష్ కూడా ఇరుక్కున్నాడు. అయినా బాలకృష్ణ ఏదో ఆశించి తండ్రి జీవితచరిత్రని తెరకెక్కిస్తే… మరేదో అయ్యింది. కానక ఎన్టీఆర్ బయోపిక్ డిజాస్టర్ బాధ్యతంతా బాలయ్య మోయాల్సిందే.

Tags:    

Similar News