ఆ రన్ టైం సినిమాలకు శాపమా…?

ఒక్కో సినిమాలో కంటెంట్ బలంగా ఉండడంతో.. మూడు గంటల రన్ టైం లాక్ చేసినా ప్రేక్షకుడికి బోర్ కొట్టదు. దర్శకనిర్మాతలు చాలా సార్లు తమ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకుడికి [more]

Update: 2019-09-12 07:24 GMT

ఒక్కో సినిమాలో కంటెంట్ బలంగా ఉండడంతో.. మూడు గంటల రన్ టైం లాక్ చేసినా ప్రేక్షకుడికి బోర్ కొట్టదు. దర్శకనిర్మాతలు చాలా సార్లు తమ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకుడికి నచ్చుతుందనినమ్మి.. రన్ టైం ని ఎక్కువగా ఉంచేస్తుంటారు. కొన్ని సినిమాలకు అది వర్కౌట్ అయినా.. చాలా సినిమాలకు ఆ రన్ టైం శాపంగా మారుతుంది.. రంగస్థలం లాంటి సినిమాలకు అది వరమైతే. సాహో లాంటి సినిమాలకు రన్ టైం శాపమే. ఎంతగా కంటెంట్ మీద నమ్మకం ఉన్నప్పటికీ… కొన్నిసార్లు తేడా కొడుతోంది.

పెరిగిన రన్ టైం….

తాజాగా వాల్మీకి టీం కూడా ఈ రన్ టై తో రిస్క్ చేస్తుంది అనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. తమిళ జిగర్తాండ కి రీమేక్ గా హరీష్ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్మీకి రన్ టైం లాక్ అయినట్లుగా..అది 2 గంటల 51 నిమిషాలకు లాక్ చేసినట్లుగా చెబుతున్నారు. హరీష్ శంకర్ ఒరిజినల్ సినిమా రన్ టైం కన్నా ఓ 15 నిముషాలు ఎక్కువ రన్ టైం ని లాక్ చేసినట్లుగా చెబుతున్నారు. వాల్మీకిగా వరుణ్తేజ్ నటనతో మాస్ ప్రేక్షకులను కట్టిపడెయ్యడం ఖాయం.. అందుకే ధైర్యంగా హారిష్ ఇలా రన్ టైం ని సెట్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఒరిజినల్ జిగర్తాండ సినిమాని యాజిటీజ్ గా కాకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కాస్త కామెడీ టచ్ కూడా ఇవ్వడంతోనే తెలుగు వాల్మీకి రన్ టైం పెరిగినట్లుగా చెబుతున్నారు. అయితే అది సినిమాకి మైనస్ కాకుండా ఉండాలంటే.. హారిష్ మేకింగ్ కూడా సినిమాకి బలం అవ్వాల్సి ఉంటుంది.

 

 

Tags:    

Similar News