ఆది రీ రిలీజ్ చేస్తా.. బాలయ్య సినిమాకి వచ్చిన కలెక్షన్లన్నీ బసవతారకం ట్రస్ట్ కే : నిర్మాత సురేష్

స్వాతిముత్యం రిలీజైన మొదటి రెండు రోజులు కలెక్షన్స్‌ చూసి భయపడ్డాం. కానీ సినిమా బాగుండటంతో మౌత్ టాక్ తోనే..;

Update: 2022-10-11 06:02 GMT

swathi muthyam success meet

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయమవుతూ.. విజయదశమి రోజున ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా స్వాతిముత్యం. ఇందులో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించగా.. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కొత్త దర్శకుడు లక్ష్మణ్ ఈ సినిమాని తెరకెక్కించాడు. అదేరోజు పెద్దహీరోలైన చిరంజీవి, నాగార్జున సినిమాలు విడుదల కాగా.. వారి పోటీని తట్టుకుని స్వాతిముత్యం నిలబడింది. ఫుల్ కామెడీతో.. థియేటర్ కు వచ్చిన ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులు పూయించింది.

తాజాగా సోమవారం సాయంత్రం స్వాతిముత్యం టీమ్ సక్సెస్ మీట్ జరుపుకుంది. ఈ సందర్భంగా బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ.. ''స్వాతిముత్యం రిలీజైన మొదటి రెండు రోజులు కలెక్షన్స్‌ చూసి భయపడ్డాం. కానీ సినిమా బాగుండటంతో మౌత్ టాక్ తోనే జనాలు వస్తున్నారు. మూడో రోజు నుంచి కలెక్షన్స్ పెరిగాయి. చిరంజీవి సినిమా ఉన్నా స్వాతిముత్యం నిలబడింది. గణేష్‌ను హీరోగా లాంచ్‌ చేసిన నాగవంశీ, చినబాబులకు రుణపడి ఉంటాను. ఓ నిర్మాతగా నేను కూడా గణేష్‌కు ఇంత మంచి లాంచింగ్ ఇవ్వనేమో." అన్నారు.
చెన్నకేశవరెడ్డి రీ రిలీజ్ గురించి మాట్లాడుతూ.. ఆ సినిమా రీ రిలీజ్ కు ఐదుకోట్ల నలభై లక్షల రూపాయల కలెక్షన్స్ వచ్చాయన్నారు. ఆ డబ్బు మొత్తాన్ని బసవతారకం ట్రస్ట్‌కు విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. త్వరలోనే ఎన్టీఆర్ ఆది సినిమాను కూడా రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ కుష్ అవుతున్నారు. ఇటీవల కాలంలో చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. వాటన్నింటికీ.. భారీ మొత్తంలో కలెక్షన్లు రావడం విశేషం.


Tags:    

Similar News