భోళాశంకర్ ఫస్ట్ లుక్ విడుదల
భోళాశంకర్ లో తమన్నా చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటిస్తుండగా.. చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. చెల్లెల్లి సెంటిమెంట్ ..
హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా భోళా శంకర్. మహాశివరాత్రి కానుకగా భోళాశంకర్ నుంచి చిరంజీవి ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్రయూనిట్. చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో వైబ్ ఆఫ్ భోళా అంటూ.. ఫస్ట్ లుక్ వీడియోను షేర్ చేశారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.
Also Read : ఆదిపురుష్ రిలీజ్ అప్ డేట్
భోళాశంకర్ లో తమన్నా చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటిస్తుండగా.. చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. చెల్లెల్లి సెంటిమెంట్ ప్రధాన కథగా తెరకెక్కుతోంది భోళాశంకర్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతోంది. ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర, అనీల్ సుంకర నిర్మిస్తున్న భోళాశంకర్ ను ఈ ఏడాదే విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.