బిగ్ బాస్ షో ని బ్రస్టు పట్టిస్తున్నారు

వరల్డ్ వైడ్ గా పాపులర్ అయినా బిగ్‌బాస్‌ కాన్సెప్ట్‌ ఇండియాలో కూడా పలు భాషల్లో సక్సెస్ అయింది. ముఖ్యంగా ఈ షో బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ [more]

Update: 2019-10-13 07:25 GMT

వరల్డ్ వైడ్ గా పాపులర్ అయినా బిగ్‌బాస్‌ కాన్సెప్ట్‌ ఇండియాలో కూడా పలు భాషల్లో సక్సెస్ అయింది. ముఖ్యంగా ఈ షో బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అయ్యి ప్రస్తుతం 13 వ సీజన్ ను నడుపుకుంటుంది. ఇక తెలుగు విషయానికి వస్తే మొదటి సీజన్ సూపర్ సక్సెస్ అయింది. నిర్వాహకులు బాగా నిర్వహించారు. కానీ సెకండ్ సీజన్ వచ్చేసరికి బ్రస్టు పట్టించారు. ముందుగానే హౌస్ లోకి వెళ్లే సెలెబ్రెటీస్ తో ఫలానా తాయిలాలు ఇస్తామని ఆశ చూపించడం, లేదా ఇన్ని వారాల పాటు ఖచ్చితంగా వుండేలా చూస్తామని మాట ఇవ్వడం లాంటివి చేసారు.

కానీ సెకండ్ సీజన్ అనుకున్నట్టు జరక్కపోయేసరికి ఈసారి ఓటింగ్‌ని కూడా తమ అధీనంలోకి తెచ్చేసుకున్నారు. మొదటి రెండు సీజన్స్ గూగుల్ ఓటింగ్స్ పెట్టి ఇప్పుడు మూడో సీజన్ కి గూగుల్ ని తీసేసి ఎక్కువ మందికి యాక్సెస్‌ లేని హాట్‌స్టార్‌ యాప్‌ ద్వారా ఓటింగ్‌ పెట్టారు. ఇలా చేయడం వల్ల టెలిఫోన్‌ ఓటింగ్‌ తమ కంట్రోల్‌లో తెచ్చుకునే వీలుంది కనుక హాట్‌స్టార్‌ ఓటింగ్‌ అంతగా ప్రభావం చూపించదు.

ముందే ఫేవరెట్‌ కంటెస్టెంట్లని డిసైడ్‌ చేసుకోవడం, వారికి అనుకూలంగా గేమ్‌ నడిపించడం, ఒకవేళ వారు నామినేషన్ లో ఉంటె వారిని ఎలాగైనా సేవ్ చేయడం వంటివి బిగ్ బాస్ నిర్వాహకులు చేస్తున్నారు. ఫైనల్ కి ఇంకా చాలా టైం ఉన్న కానీ అప్పుడే టాస్కులు ముగించేసి పిచ్చి పిచ్చి ఆటలతో కాలక్షేపం చేయిస్తూ షోని మరికాస్త చెత్త చేసారు. అసలే బిగ్ బాస్ చూడడం చాలామంది తగ్గించారు. ఇప్పుడు ఇటువంటి చేస్తుంటే తర్వాతి సీజన్లకి జనం ఓట్లేయడం కూడా మానేస్తారు.

Tags:    

Similar News