నేను ఉండలేను అంటున్నా వినరేంటిరా బాబు?
బిగ్ బాస్ సీజన్ 4 గత వారం చప్పగా ఉన్నప్పటికీ… ఇప్పుడిప్పుడే కాస్త రసవత్తరంగా మారింది. దేత్తడి హారిక అలేఖ్య హాట్ షో, మోనాల్ తడి అందాలు, [more]
బిగ్ బాస్ సీజన్ 4 గత వారం చప్పగా ఉన్నప్పటికీ… ఇప్పుడిప్పుడే కాస్త రసవత్తరంగా మారింది. దేత్తడి హారిక అలేఖ్య హాట్ షో, మోనాల్ తడి అందాలు, [more]
బిగ్ బాస్ సీజన్ 4 గత వారం చప్పగా ఉన్నప్పటికీ… ఇప్పుడిప్పుడే కాస్త రసవత్తరంగా మారింది. దేత్తడి హారిక అలేఖ్య హాట్ షో, మోనాల్ తడి అందాలు, అవినాష్ కామెడీ, దివి హాట్ డాన్స్, అమ్మ రాజశేఖర్ కామెడీ అంత ఇప్పుడిప్పుడే బిగ్ బాస్ బుల్లితెర ప్రేక్షకులకు కనెక్ట్ అవుతున్నారు. కానీ బిగ్ బాస్ సీజన్ 4 లో ఓ తప్పు జరిగింది అది పెద్దావిడ గంగవ్వని బిగ్ బాస్ లోకి తీస్కోవడమే. ఓకె ఆవిడా ఉంటే క్రేజ్ ఉంటుంది.. అందరూ చూస్తారనుకున్నారు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి గంగవ్వని తీసుకొచ్చి ఎంత పెద్ద తప్పు చేసారో ఆమె గత రాత్రి బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ కి చెప్పి ఏడవడం చూస్తే అర్ధమవుతుంది. ఓ పెద్దావిడ.. అందులోని ఏసీ గదులు అలవాటు లేని వాతావరణంలోకి ఆవిడని తీసుకొచ్చారు.
నాకు ఏసీ పడడం లేదు, ఈ వాతావరణం పడడం లేదు. ఇక్కడ ఉండలేకపోతున్నాను, మీరు మంచిగానే చూసుకుంటున్నారు. అమ్మ నాన్న చిన్నప్పుడే పోయారు, భర్త కొట్టిన దెబ్బలకి ఇప్పటికి బాధ ఉంది.. మీరు దేవుడి లెక్క. నన్ను బాగా చూసుకుంటున్నారు. కానీ నేనే ఉండలేకపోతున్నాను. నా ఇంటికాడ లేస్తే ఎండ తగులుతుంది. మంచిగా మట్టిలో పని చేసుకుంటాను. కానీ ఇక్కడ ఎండ లేదు. ఇంటి మీద బెంగవుతుంది. నేను ఇక్కడికి వచ్చే ముందు రెండు నెలలుండాలనుకున్నాను.. కానీ ఉండలేకపోతున్నా నన్ను పంపేయ్ బిగ్ బాస్ అన్నా బిగ్ బాస్ మీ ఆరోగ్యానికి ఏం కాదు.. డాక్టర్స్ చెక్ చేస్తారని చెప్పడం చూస్తుంటే గంగవ్వని ఈ వారం కూడా పంపరు అనిపిస్తుంది.
మరి అంతగా బాధపడుతున్న గంగవ్వని ఇంటికి పంపడం ఉత్తమం అంటున్నారు బుల్లితెర ప్రేక్షకులు. ఆమేని సముదాయించి.. మీరు ఇలాంటి దెబ్బలు, ఇలాంటి కష్టలు ఎన్నో చూసారు ఇదో లెక్క మీరు హౌస్ లోనే ఉండాలని చెప్పినా గంగవ్వ ఇక ఊరుకునేలా కనిపించడం లేదు. మల్లి శనివారం నాగార్జున తో గంగవ్వ మాట్లాడే మొదటి మాట నన్ను ఇంటికి పంపెయ్యండి అనే అంటుంది అనే అభిప్రాయాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. మరి లోకం తెలియని గంగవ్వ ఏదో చిన్న చిన్న ఇంటర్వూస్ అంటూ హైలెట్ అయ్యింది కానీ.. ఇప్పుడు హౌస్ లో కట్టిపడేసినట్లుగా.. ఎవరూ తెలియని మొహాల మధ్యన ఉండడం మాత్రం కష్టమే.