ఎవడి ఆట వాడిది?
బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ అందరూ సీజన్ 3 వరకు ఎపిసోడ్స్ ని ఫుల్ గా చూసేసి హౌస్ లో ఎలా ఉండాలో ఎలా ఉంటే [more]
బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ అందరూ సీజన్ 3 వరకు ఎపిసోడ్స్ ని ఫుల్ గా చూసేసి హౌస్ లో ఎలా ఉండాలో ఎలా ఉంటే [more]
బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ అందరూ సీజన్ 3 వరకు ఎపిసోడ్స్ ని ఫుల్ గా చూసేసి హౌస్ లో ఎలా ఉండాలో ఎలా ఉంటే హైలెట్ అవుతామో అనే దానిమీద ఫుల్ క్లారిటీతోనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టినట్టుగా అడుగడుగునా ప్రూవ్ అవుతూనే ఉంది. మొదటి వారం డల్ గా ఉన్నారని నాగార్జున చిన్న పిల్లలికి ఇచ్చినట్టుగా ఓ క్లాస్ ఇచ్చాక ఇక హౌస్ మేట్స్ అంతా రెచ్చిపోయి మనుషులు – రోబో టాస్క్ లో అంతకన్నా ఎక్కువగా కేకల మీద ఫోకస్ పెట్టారు. అందులో మెహబూబ్, సోహెల్ అయితే మరి రెచ్చిపోయి.. తమ ఉనికిని చాటుకుంటున్నారు. వాళ్ళకి తెలుసు వాళ్ళు పెద్ద సెలెబ్రిటీస్ కాదని. అందుకే వాళ్ళు గొడవలు, టాస్క్ లో అరుపులు, కేకలు వేసి టాస్క్ చేస్తే హైలెట్ అవుతామనుకుని వీలున్నప్పుడల్లా హౌసెమెట్స్ తో గొడవలకు దిగుతున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న కెప్టెన్సీ టాస్క్ లో సోహెల్, మెహబూబ్ లు దొంగలు, గూండాయిజం చేస్తున్నారు. వాళ్ళలా దొంగతనం చేసి.. గొడవ పడితే ప్రేక్షకులకు మజాగానే ఉంది. కానీ ఒక టైం లో అది శృతి మించి చిరాకు పెడుతుంది. బిగ్ బాస్ ఎన్ని రూల్స్ పెట్టినా ఒక్క హౌస్ మేట్స్ కూడా వాటిని ఫాలో అవడం లేదు. బిగ్ బాస్ పదే పదే హెచ్చరిస్తున్న ఎవడి అట వాడితే. ఎవరు మారడం లేదు. ఇక మరో కంటెస్టెంట్ మోనాల్ గజ్జర్ అయితే అనవరసరమైన దానికి గట్టిగట్టిగా ఏడుస్తూ ఇర్రిటేట్ చేస్తుంది. ఇక సోహెల్ మరి గొడవలు పెట్టుకుని అరుపుల స్టార్ గా పేరు తెచ్చేసుకున్నాడు. అభిజీత్, అమ్మ రాజశేఖర్‌తో ఆల్‌మోస్ట్ కొట్టుకునే స్టేజికి వెళ్లిపోయాడు సోహెల్. ఇక మెహబూబ్, సోహెల్ కంత్రీగాళ్లని నెటిజెన్స్ కి బాగా అర్ధమే య్యింది. ఇక కొంతమంది బ్యాచ్ ల బ్యాచ్ ల గా గేమ్ ఆడుతున్నారు. అలాంటివాళ్లకి బిగ్ బాస్ నుండి పదే పదే హెచ్చరికలు వచ్చిన హౌసెమెట్స్ మాత్రం పట్టించుకున్న పాపన పోలేదు.