బిగ్ బాస్ సీజన్ 6 ఎప్పుడంటే?
బిగ్ బాస్ సీజీన్ 5 ముగిసింది. . మొత్తం 19 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. చివరకు బిగ్ బాస్ విజేతగా సన్నీ నిలిచాడు
బిగ్ బాస్ సీజీన్ 5 ముగిసింది. ఐదో సీజన్ 105 రోజుల పాటు సాగింది. మొత్తం 19 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. చివరకు బిగ్ బాస్ విజేతగా సన్నీ నిలిచాడు. రన్నర్ అప్ గా షణ్ముఖ్ జస్వంత్ నిలిచాడు. టాప్ 5లో నిలిచిన సన్నీ, మానస్, శ్రీరామచంద్ర, షణ్మఖ్, సిరిలతో గ్రాండ్ ఫినాలే బిగ్ బాస్ అదరగొట్టాడు. సినిమా ప్రమోషన్లతో పాటు ప్రముఖ దర్శకులు, నటీనటులు బిగ్ బాస్ స్టేజీపై సందడి చేశాడు.
రెండు నెలల్లో....
అయితే ఇదే వేదికపై నాగార్జున ముఖ్యమైన ప్రకటన చేశాడు. సాధారణంగా బిగ్ బాస్ సీజన్ అయిపోయిన తొమ్మిది నెలల తర్వాత మరో సీజన్ ప్రారంభమవుతుంది. గత ఏడాది కరోనా కారణంగా ఆలస్యంగా ప్రారంభమయింది. అయితే నాగార్జున మాత్రం మరో రెండు నెలల్లో బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభమవుతుందని ప్రకటించడాడు. అంటే ఫిబ్రవరి నెలాఖరుకు గాని, మార్చి మొదటి వారంలో కాని షో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటి నుంచే కంటెస్టెంట్ల ఎంపిక కోసం బిగ్ బాస్ నిర్వాహకులు కసరత్తులు మొదలు పెట్టాల్సి ఉంటుంది.