Sivaji : మెగా ఫ్యామిలీపై శివాజీ కామెంట్స్.. వాళ్ళకి సీఎం అవ్వాలంటే..

బిగ్‌బాస్ శివాజీ మెగా ఫ్యామిలీ పాలిటిక్స్ గురించి వైరల్ కామెంట్స్ చేశారు. వాళ్ళు సీఎం అవ్వాలంటే..

Update: 2023-12-30 12:44 GMT
Sivaji : టాలీవుడ్ నటుడు శివాజీ.. ఇటీవల బిగ్‌బాస్ కి కంటెస్టెంట్ గా వెళ్లి మరింత ఫేమ్ ని సంపాదించుకున్నారు. కాగా శివాజీ ఏపీ రాజకీయాల్లో కూడా పాల్గొంటూ వచ్చారు. ప్రత్యేక హోదా పై అనేక చర్చలు, సభలు కూడా చేశారు. ప్రస్తుతం అయితే పాలిటిక్స్ కి కొంచెం గ్యాప్ ఇచ్చారు. కాగా బిగ్‌బాస్ హౌస్ లోకి వెళ్లకముందే శివాజీ ఒక వెబ్ సిరీస్ లో నటించారు. #90's అనే టైటిల్ తో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ సిరీస్ ఆడియన్స్ ముందుకు రాబోతుంది.
తాజాగా ఈ వెన్ సిరీస్ టీం ఒక ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో శివాజీని.. "పొలిటికల్ గా మీరు ఒంటరిగానే ప్రయాణిస్తున్నారు. అటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒంటరిగానే వెళ్తున్నారు. మీరు ఆయనతో కలవొచ్చు కదా. ఎందుకు ఒంటరిగా వెళ్తున్నారు" అని ప్రశ్నించారు.
దీనికి శివాజీ బదులిస్తూ.. "నేను ఏది మాట్లాడినా సూటిగా మాట్లాడతాను. అది కొందరికి ఇబ్బంది కలిగించవచ్చు. కానీ నిజమేంటంటే ఆంధ్రప్రదేశ్‌లో గాని, తెలంగాణలో గాని మెగాస్టార్ ఫ్యామిలీకి ఉన్న ఫ్యాన్ బేస్ ఎవరికి లేదు. అలాంటి వాళ్ళకి సీఎం అవ్వాలంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎక్కడో ఒక తప్పు జరుగుతుంది. అది సరిదిద్దుకుంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి సీఎం అవ్వడం పెద్ద విషయం కాదు" అని వైరల్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. 
Tags:    

Similar News