మరోసారి బాలీవుడ్ భామతో చరణ్?

చిరంజీవి ఆచార్య సినిమాలో రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే.  కొరటాల శివ రామ్ చరణ్ కోసం ఏకంగా 30 నిమిషాల కీలక పాత్ర [more]

Update: 2020-12-07 01:16 GMT

చిరంజీవి ఆచార్య సినిమాలో రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే.  కొరటాల శివ రామ్ చరణ్ కోసం ఏకంగా 30 నిమిషాల కీలక పాత్ర రాసుకున్నాడట. అయితే ఆ 30 నిమిషాల రోల్ లో రామ్ చరణ్ కి ఓ హీరోయిన్ ఉంటుంది అని, అలాగే ఆ హీరోయిన్ తో డ్యూయెట్ ఉంటుంది అంటూ కొరటాల కన్ఫర్మ్ కూడా చేసాడు. మరి చరణ్ సరసన ఏ హీరోయిన్ నటిస్తుందో అనే క్యూరియాసిటీ అందరిలో ఉంది. ఎందుకంటే చిరు సరసన గ్లామర్ గర్ల్ కాజల్ అగర్వాల్ నటిస్తుండగా చరణ్ కి సమంత కానీ రష్మిక కానీ హీరోయిన్ నటించే ఛాన్స్ ఉందంటూ ప్రచారం జరుగుతుంది.

అయితే కొరటాల ఇప్పుడు చరణ్ కోసం సమంత కానీ, రష్మిక కానీ హీరోయిన్స్ గా చూడడం లేదట… కొరటాలకి చరణ్ రోల్ కోసం ముందు నుండి బాలీవుడ్ భామని తేవాలని అనుకుంటున్నాడట. ఇప్పటికే చరణ్ RRR లో అలియా భట్ తో నటిస్తున్నాడు. గతంలో వినయ విధేయ రామాలోను కియారా అద్వానీతో నటించాడు. ఇక ఇపుడు మరో బాలీవడో భామతో చరణ్ ఆచర్యలో నటించబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్స్ లిస్ట్ కొరటాల చేతిలో ఉందని.. రామ్ చరణ్ కోసం బాలీవుడ్ భామనే కోరటాల ఎంపిక చేస్తాడని తెలుస్తుంది. బాలీవుడ్ భామ అయితే కొత్త గా ఉంటుంది, క్రేజ్ ఉంటుంది అని బాలీవుడ్ భామని చూస్తున్నారట.

Tags:    

Similar News