పవన్ కి బాలీవుడ్ భామ ఫిక్స్?

పవన్ కళ్యాణ్ – క్రిష్ దర్శకత్వంలో పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కనున్న సినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ ని హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ స్పెషల్ సెట్ [more]

Update: 2020-04-02 07:21 GMT

పవన్ కళ్యాణ్ – క్రిష్ దర్శకత్వంలో పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కనున్న సినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ ని హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ స్పెషల్ సెట్ లో తెరకేక్కిన్చారు. ఔరంగజేబు కాలం నటి కథతో తెరకెక్కనున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కోహినీర్ వజ్రాన్ని కొట్టేసే గజ దొంగగా నటించబోతున్నాడు. చారిత్రాత్మక చిత్రం కానక ఈ సినిమా కోసం చాలా రకాల సెట్స్ అవసరమున్నాయట. వాటి కోసం క్రిష్ చాలా కష్టపడుతున్నాడట. ప్రస్తుతం కరోనా వైరస్ వలన లాక్ డౌన్ నడుస్తుంది కనక… ఇంట్లో నుండే సినిమాకి కావాల్సిన ప్రీ ప్రొడక్షన్ పనులను చక్కబెడుతున్న క్రిష్.. పవన్ కళ్యాణ్ కోసం ఓ బాలీవుడ్ భామని హీరోయిన్ గాస్ సెట్ చేసాడట.

ఇంతకుముందు పవన్ కళ్యాణ్ కోసం ప్రగ్య జైస్వాల్, కియారా అద్వానీ హీరోయిన్స్ గా నటించబోతున్నారని న్యూస్ నడిచింది. కానీ తాజాగా క్రిష్ కి కియారా అద్వానీ డేట్స్ ఖాళీ లేదని నో అని చెప్పడంతో… క్రిష్ మరో బాలీవుడ్ భామని చూసుకున్నాడని అంటున్నారు. గత ఏడాది సాహో సినిమాలో ప్రభాస్ కోసం ఐటెం సాంగ్ చేసిన జాక్వలిన్ ఫెర్నాండేజ్ ని పవన్ కళ్యాణ్ కోసం క్రిష్ సెలెక్ట్ చేసినట్లుగా టాక్. ఇప్పటికే జాక్వలిన్ హైదరాబాద్ వచ్చి క్రిష్ తో కథ చర్చల్లో పాల్గొందని.. పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఈ హాటీ దాదాపుగా 40 రోజులు కేటాయించినట్లుగా టాక్. ఎప్పుడు హాట్ గా, గ్లామర్ షో చేసే జాక్వలిన్ ఈ సినిమా కోసం సరికొత్తగా చాలా భిన్నంగా కనిపించబోతున్నట్లుగా టాక్.

Tags:    

Similar News