నిలకడగా బ్రహ్మానందం ఆరోగ్యం

హాస్య నటుడు బ్రహ్మానందం గుండె సంబంధ సమస్యతో ఆస్పత్రిలో ఉన్నారనే విషయం తెలిసి ఆయన అభిమానులు, సన్నిహితులు కలవరపడ్డారు. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన [more]

;

Update: 2019-01-17 13:49 GMT
brahmanandam health stable
  • whatsapp icon

హాస్య నటుడు బ్రహ్మానందం గుండె సంబంధ సమస్యతో ఆస్పత్రిలో ఉన్నారనే విషయం తెలిసి ఆయన అభిమానులు, సన్నిహితులు కలవరపడ్డారు. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన తనయుడు హీరో గౌతమ్ తెలిపారు. కొన్ని నెలలుగా ఛాతిలో అసౌకర్యంగా అనిపించడంతో హైదరాబాద్‌లోని ప్రముఖ డాక్టర్‌ని సంప్రదించారు బ్రహ్మానందం. వారి సలహా మేరకు శస్త్ర చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. దేశంలోనే అత్యుత్తమమైన ముంబైలోని ‘ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్‘లో సోమవారం గుండె ఆపరేషన్‌ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఐసీయూ నుంచి సాధారణ గదికి మార్చినట్లు గౌతమ్ తెలిపారు.

Tags:    

Similar News