చరణ్ ఫ్రెండ్… మహేష్ ది ఫ్రెండ్లి నేచర్ అంటుంది!!

బాలీవుడ్ నుండి తెలుగు స్టార్ హీరోలతో సినిమాలు చేసి.. మళ్ళీ బాలీవుడ్ లో సూపర్ హిట్స్ కొట్టి..అక్కడ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిన కియారా అద్వానీకి.. [more]

Update: 2020-04-16 01:31 GMT

బాలీవుడ్ నుండి తెలుగు స్టార్ హీరోలతో సినిమాలు చేసి.. మళ్ళీ బాలీవుడ్ లో సూపర్ హిట్స్ కొట్టి..అక్కడ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిన కియారా అద్వానీకి.. మళ్ళీ తెలుగులో స్టార్ హీరోల అవకాశాలు వెళ్తున్నప్పటికీ.. కియారా కి బాలీవుడ్ అవకాశాలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే…తెలుగు అవకాశాలను పక్కనబెడుతుంది. అయితే ప్రస్తుతం బిజిగా ఉన్న కియారా కెరీర్ టర్న్ తిరిగింది హిందీ అర్జున్ రెడ్డి వలనే. తెలుగులో చేసిన రెండు సినిమాలకు కియారకి పెద్దగా పేరు రాలేదు.

మహేష్, రామ్ చరణ్ లతో సినిమాలు చేసిన కియారా అద్వానీకి తెలుగులో ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోల అవకాశాలు రావడం.. బాలీవుడ్ మూవీస్ తో డేట్స్ ఖాళీలేక అమ్మడు సౌత్ కి రావడం లేదు. అయితే కియారా తాజాగా మహేష్, రామ్ చరణ్ ల గురించి మాట్లాడుతో.. మహేష్ బాబు ఎంత పెద్ద స్టార్ హీరో, సూపర్ స్టార్ రేంజ్ అయినా.. చాలా ఫ్రెండ్లిగా ఉంటాడడని.. ఇక రామ్ చరణ్ అయితే తనకి మంచి స్నేహితుడు అని చెబుతుంది కియారా అద్వానీ. రామ్ చరణ్ బెస్ట్ బడ్డీ (మంచి ఫ్రెండ్) అయిపోయాడని చెప్పింది.

Tags:    

Similar News