రామ్ గోపాల్ వర్మ పై చీటింగ్ కేసు.. ఏమని ఆరోపిస్తున్నారంటే..!

రామ్ గోపాల్ వర్మ పై చీటింగ్ కేసు.. ఏమని ఆరోపిస్తున్నారంటే..!

Update: 2022-05-24 03:05 GMT

డైరెక్టర్‌ రాంగోపాల్ వర్మ మరో సారి వార్తల్లోకెక్కాడు. తాజాగా ఆయనపై హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. శేఖర్ ఆర్ట్ క్రియేషన్ యజమాని కొప్పాడ శేఖర్ రాజు ఫిర్యాదు మేరకు వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాంగోపాల్ వర్మ సమర్పణలో విడుదలైన చిత్రం 'ఆశ ఎన్‌కౌంటర్'. ఈ సినిమా యదార్థ ఘటన ఆధారంగా రూపొందించారు. నవంబర్, 2019లో హైదరాబాద్ శివారులో వెటర్నరీ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన నిందితుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాను వివాదాలు చుట్టుముట్టడంతో పలుమార్లు చిత్రం విడుదల కాకుండా వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఏడాది జనవరిలో విడుదలైంది.

ఆర్జీవీ 56 లక్షలు అప్పు తీసుకున్నారని, తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారని శేఖర్ రాజు కూకట్‌పల్లి కోర్టును ఆశ్రయించారు. 'దిశ' సినిమా నిర్మాణ సమయంలో వర్మ తన నుంచి రూ.56 లక్షలు తీసుకున్నట్లు శేఖర్ రాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకపోగా భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తన డబ్బును తిరిగి ఇవ్వాలని కోరగా, ఆర్జీవీ తనను హెచ్చరించాడని, తిరిగి చెల్లించలేదని కూడా శేఖర్ రాజు చెప్పుకొచ్చారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ 406, 407, 506 కింద కేసు నమోదు చేయాలని పోలీసులను కోరింది. శేఖర్‌ రాజు కొద్దిరోజుల క్రితం రమణారెడ్డి అనే కామన్ ఫ్రెండ్ ద్వారా రామ్‌ గోపాల్‌ వర్మతో తనకు పరిచయం ఏర్పడిందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో వారి మధ్య పరిచయం పెరిగి అతను వర్మకి జనవరి 2020లో ₹ 8 లక్షలు, కొన్ని రోజుల తర్వాత మరో ₹ 20 లక్షలు, మరోసారి రూ. 28 లక్షలు తీసుకున్నారు. తన సినిమా విడుదలకు ముందే ఈ మొత్తాన్ని ఇస్తానని తనకు హామి ఇచ్చినట్లు ఫిర్యాదులో తెలిపారు. వర్మ చెప్పిన సమయం దాటిపోయింది. ఆ చిత్రానికి వర్మ నిర్మాత కాదని రాజుకు తెలియడంతో అతను మోసపోయినట్లు గ్రహించానని తెలిపాడు. అందుకే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.


Tags:    

Similar News