కొరటాల అలా కోరాడా?
చిరంజీవి సై రా నరసింహారెడ్డి షూటింగ్ పూర్తి కాగానే.. కొరటాల శివ తో మరో సినిమాకి కమిట్ అయ్యాడు. భరత్ అనే నేను సినిమా తర్వాత కొరటాల [more]
చిరంజీవి సై రా నరసింహారెడ్డి షూటింగ్ పూర్తి కాగానే.. కొరటాల శివ తో మరో సినిమాకి కమిట్ అయ్యాడు. భరత్ అనే నేను సినిమా తర్వాత కొరటాల [more]
చిరంజీవి సై రా నరసింహారెడ్డి షూటింగ్ పూర్తి కాగానే.. కొరటాల శివ తో మరో సినిమాకి కమిట్ అయ్యాడు. భరత్ అనే నేను సినిమా తర్వాత కొరటాల చిరు తో చేయబోయే సినిమా కథ మీదనే కూర్చుకున్నాడు. అయితే మధ్యలో కొరటాల – చిరు మూవీ ఆలస్యం అవుతుందని….. లేదంటే ఆగినా ఆగొచ్చనే ఒక గాసిప్ మీడియాలో చక్కర్లు కొట్టేసరికి.. ఈ సినిమాకి నిర్మాతగా పనిచేయనున్న రామ్ చరణ్ హడావిడిగా కొరటాల – చిరు సినిమా ఉంటుందని.. త్వరలోనే మొదలవుతుందని.. అధికారిక ప్రకటన ఇప్పించాడు. ప్రస్తుతం చిరు మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో కొరటాల బాగా బిజీగా వున్నాడు.
ఈలోపు కొరటాల – చిరు ప్రాజెక్ట్ విషయంలో ఒక ఆసక్తికరమైన వార్త ఫిలింసర్కిల్స్ లో హాట్ హాట్ గా చక్కర్లు కొడుతోంది. ఆదేమిటంటే.. తన తండ్రి సినిమాలను వరసగా నిర్మిస్తున్న రామ్ చరణ్ ఈ సినిమాకి కొరటాల శివ కి భారీ పారితోషకమే ఇస్తున్నాడట. మరి తాను డైరెక్ట్ చేసిన అన్ని సినిమాలు సక్సెస్ అవడంతో.. కొరటాల రేంజ్ పెరిగింది. అందుకే కొరటాల ఒక్కో సినిమాకి 10 నుండి 15 కోట్ల మధ్య పారితోషకం తీసుకుంటున్నాడు. ఇక చరణ్ కూడా ఆ లెక్కనే కొరటాలకు పారితోషకం ఫిక్స్ చేద్దామనుకున్నాడట.
కానీ కొరటాల తనకి ఈ సినిమా లో షేర్ కావాలని అడిగినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం కోట్ల అడ్వాన్స్ ని అందుకున్న కొరటాల శివ… మిగతా మొత్తం పారితోషికంగా కాకుండా ఉత్తరాంధ్ర ప్రాంతంలోని షేర్ లో వాటా అడిగినట్లుగా తెలుస్తుంది. అయితే కొరటాల కోరికకు రామ్ చరణ్ కూడా ఒకే చెప్పేసినట్టుగా చెబుతున్నారు. మరి కొరటాల – చిరు – చరణ్ కాంబో అంటే ఆ సినిమా మీద భారీగా అంచనాలే ఉంటాయి. అలాగే సినిమా కున్న అంచనాలు క్రేజ్ తో సినిమా కూడా భారీ హిట్ అయితే కొరటాలకు భారీగానే ముడుతుంది మరి. మరి ఇదంతా చూస్తుంటే.. కొరటాలకు తెలివితేటలూ పెరిగాయ్ అనిపిస్తుంది కదూ!