Jahnvi Kapoor : ఆస్తులు అమ్ముకుంటున్న జాన్వీ కపూర్.. కారణమేంటి..?

ముంబైలో ఉన్న ఉమ్మడి ఆస్తులను అమ్ముకుంటున్న జాన్వీ కపూర్. ఎందుకో తెలుసా..?;

Update: 2023-12-25 09:51 GMT

Jahnvi Kapoor

Janhvi Kapoor : అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైన నటి 'జాన్వీ కపూర్'. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ వస్తున్న జాన్వీ.. ఎన్టీఆర్ 'దేవర'తో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. కాగా జాన్వీ కపూర్ కుటుంబానికి ముంబై, చెన్నైలో ఆస్తులు ఉన్న సంగతి తెలిసిందే. శ్రీదేవి, బోణి కపూర్, ఖుషీ కపూర్ పేర్ల మీద కోట్ల ప్రోపర్టీస్ ఉన్నాయి. వాటిలో కొన్ని ఇప్పుడు అమ్మకానికి పెట్టారంట.

ముంబై ఆంధేరీలో ఉమ్మడి ఆస్తిగా బోనీ కపూర్‌, జాన్వీ, చెల్లెలు ఖుషీకి నాలుగు ఫ్లాట్స్‌ ఉన్నాయట. అయితే వీటిని అసలు ఉపయోగించకపోవడంతో.. అమ్మేయాలని నిర్ణయించుకున్నారట. ఈక్రమంలోనే 1870 స్క్వేర్ ఫీట్స్ ఏరియా విస్తీర్ణంలో ఉన్న రెండు ఫ్లాట్స్‌ని, 1614 స్క్వేర్ ఫీట్స్ ఏరియా విస్తీర్ణంలో ఉన్న మరో రెండు ఫ్లాట్స్‌ని కలిపి.. దాదాపు 12కోట్లకు అమ్మేసినట్లు సమాచారం.
ఈ ఆస్తులను కేవలం ఉపయోగించడం లేదనే కారణంతోనే అమ్మినట్లు జాన్వీ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ ఉమ్మడి ఆస్తులను అమ్మేసిన జాన్వీ.. త్వరలో ముంబైలోనే ఓ ఖరీదైన భవంతి కొనే ఆలోచనలో ఉన్నారట. ఇక జాన్వీ సినిమాల విషయానికి వస్తే.. వరుస ఆఫర్లు అందుకుంటున్నప్పటికీ సరైన విజయం మాత్రం వరించలేదు. ఇప్పటికీ బాలీవుడ్ అరడజనకు పైగా సినిమాల్లో నటించిన ఒక సూపర్ హిట్ కూడా అందలేదు.
ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'దేవర'లో నటిస్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా ఒక బ్లాక్ బస్టర్ ని అందుకొని స్టార్ హీరోయిన్ హోదా అందుకోవాలని ఆశిస్తున్నారు. మరి జాన్వీ ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి జనవరిలో ఓ చిన్న గ్లింప్స్ ఆడియన్స్ ముందుకు రాబోతుందని తెలుస్తుంది. జనవరి 8న ఈ గ్లింప్స్ ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఏప్రిల్ 5న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.
Tags:    

Similar News