రాజుగారు మంచి ఊపులో ఉన్నారే..!

గత ఏడాది ప్లా ప్స్ తో కొట్టు మిట్టాడినా.. ఈ ఏడాది ఒకే ఒక్క సినిమాతో హై లోకి వెళ్ళిపోయాడు నిర్మాత దిల్ రాజు. 2017 చివరిలో [more]

Update: 2019-04-06 06:29 GMT

గత ఏడాది ప్లా ప్స్ తో కొట్టు మిట్టాడినా.. ఈ ఏడాది ఒకే ఒక్క సినిమాతో హై లోకి వెళ్ళిపోయాడు నిర్మాత దిల్ రాజు. 2017 చివరిలో యావరేజ్ టాకొచ్చిన ఎంసీఏ తో భారీ హిట్ కొట్టిన దిల్ రాజు.. మళ్ళీ ఈ ఏడాది మొదట్లోనే ఎఫ్ 2 తో 40 కోట్ల లాభాలను వెనకేసుకున్నాడు. ఇక తనకు భారీ హిట్స్ ఇచ్చిన దర్శకులకు దిల్ రాజు ఈమధ్యన కొత్తగా గిఫ్ట్స్ గట్రా ఇస్తున్నాడు. ఎఫ్ 2తో బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు అనిల్ రావిపూడికి దిల్ రాజు చాలా ఖరీదైన ఒక కారుని గిఫ్ట్ ఇచ్చాడనే టాక్ నడిచింది. తాజాగా దిల్ రాజు మరో దర్శకుడికి ఒక భారీ గిఫ్ట్ ఇచ్చాడనే న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

సినిమాకు ఒప్పించినందుకే…

ఆ డైరెక్టర్ ఎవరో కాదు 2017లో దిల్ రాజు నిర్మాణంలో ఎంసీఏ సినిమా దర్శకుడు వేణు శ్రీ రామ్. ఎప్పుడో హిట్ సినిమా అందించిన వేణు శ్రీ రామ్ కి దిల్ రాజు ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వడమేమిటో అనుకునేరు… ఈమధ్యన వేణు శ్రీరామ్ డైరెక్టర్ గా దిల్ రాజు అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అయితే వేణు శ్రీ రామ్ మంచి కథతో దిల్ రాజు బ్యానర్ లో అల్లు అర్జున్ తో సినిమా చెయ్యడానికి అల్లు అర్జున్ ని కథతో మెప్పించాడు. వేణు శ్రీ రామ్ చెప్పిన కథలోని కొత్తదనం నచ్చడంతో, త్రివిక్రమ్ సినిమా పూర్తి కాగానే నీతోనే సినిమానే చేస్తానని అల్లు అర్జున్ మాట ఇచ్చేశాడు. మరి అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోని ఒప్పించినందుకు గాను వేణు శ్రీరామ్ కి దిల్ రాజు ఇప్పుడు ఖరీదైన కారుని గిఫ్ట్ ఇచ్చేసాడు. మరి ఇంకా సినిమా పట్టాలెక్కలేదు, విడుదలవలేదు, హిట్ అవలేదు. అయినా దిల్ రాజు మాంచి ఊపు మీద ఇలా వేణుకి కారు గిఫ్ట్ అందించేసాడు.

Tags:    

Similar News