‘ఎస్’ చెప్పిన తరువాత ‘నో’ చెప్పిన రాజు..!

‘మహర్షి’ సినిమాను ముగ్గురు బడా నిర్మాతలు నిర్మిస్తున్నారు. దిల్ రాజు, పీవీపీ, అశ్వనీదత్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే దిల్ రాజు మహేష్ నెక్స్ట్ మూవీకి [more]

Update: 2019-05-01 08:17 GMT

‘మహర్షి’ సినిమాను ముగ్గురు బడా నిర్మాతలు నిర్మిస్తున్నారు. దిల్ రాజు, పీవీపీ, అశ్వనీదత్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే దిల్ రాజు మహేష్ నెక్స్ట్ మూవీకి కూడా నిర్మాణ భాగస్వామిగా ఉంటాడని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో అనిల్ సుంకర నిర్మాణంలో ఓ సినిమా చేయనున్నాడు. అయితే అనిల్ సుంకరతో ఈ సినిమాకు భాగస్వామిగా ఉండాలని దిల్ రాజు ని మహేష్ కోరాడట. మహేష్ మీద ఇష్టంతోనే భాగస్వామ్యం తీసుకోవడానికి దిల్‌ రాజు అంగీకరించాడు. ‘మహర్షి’తోనే దిల్ రాజుకు ఇద్దరు, ముగ్గురితో కలిసి సినిమా తీస్తే లాభాలు ఏమి ఉండవని దిల్ రాజుకి తెలిసి వచ్చింది.

లాభాలు ఉండవని తెలిసి…

మళ్లీ ఇప్పుడు చూస్తూ చూస్తూ మరోసారి ఆ తలనొప్పి పెట్టుకోవడం ఇష్టం లేక మహేష్‌ని కలిసి అనిల్‌ సుంకరతో కలిసి పని చేయలేనని దిల్‌ రాజు చెప్పాడట. మరోవైపు అనిల్ సుంకర కూడా మహేష్ చిత్రాన్ని తాను ఒక్కడినే నిర్మిస్తే తన అప్పుల నుంచి బయటపడవచ్చునని అనుకుంటున్నాడట. మరి మహేష్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని అనిల్ సుంకర ఒక్కడికే ఇస్తాడా లేదా వేరే ప్రొడ్యూసర్ ని జత చేస్తాడా అన్నది చూడాల్సి ఉంది. ఇక మహేష్ మహర్షి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ హైదరాబాద్ లో జరగనుంది.

Tags:    

Similar News