ప్రియా ప్రకాష్‌ పై ఫైర్ అయిన డైరెక్టర్..!

కన్నుగీటి దేశవ్యాప్తంగా ఒక్క రోజులో వైరల్‌ అయిపోయిన ప్రియా ప్రకాష్‌ వారియర్‌ మొదటి సినిమా లవర్స్‌ డే అన్ని చోట్ల డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాలో [more]

Update: 2019-03-11 06:24 GMT

కన్నుగీటి దేశవ్యాప్తంగా ఒక్క రోజులో వైరల్‌ అయిపోయిన ప్రియా ప్రకాష్‌ వారియర్‌ మొదటి సినిమా లవర్స్‌ డే అన్ని చోట్ల డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాలో ప్రియా పాత్ర ఏమీ లేదని, ఆమె కన్నుగీటడం మినహా సినిమాలో ఏమీ లేదని, కనీస హావభావాలు కూడా పలికించలేదని విమర్శక లోకం కోడై కూసింది. ఆమెకు సడన్ గా పాపులారిటీ రావడంతో కథ మొత్తం మార్చేశారు దర్శకుడు. మొదట ప్రియాది కేవలం కొద్ది నిమిషాల నిడివి ఉన్న పాత్రేనట. కానీ ఆమెకు క్రేజ్ రావడంతో ఆమెనే కథానాయికగా పెట్టమని నిర్మాతలు ఒత్తిడి తెచ్చారట.

ఆమెకు నటనే రాదు…

దీంతో డైరెక్టర్ ఒమర్‌ లులు కథని ఆమె పాత్రకి అనుగుణంగా మార్చాడట. మరో మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ ని ఈ విషయం బాదించినా పబ్లిక్‌ డిమాండ్‌ మేరకు అందరూ తలవంచక తప్పలేదట. ఫలితంగా క్లయిమాక్స్‌ కంగాళీగా మారింది. దీంతో సినిమా డిజాస్టర్ అయింది. ప్రియా కోసం తాను చాలా త్యాగాలు చేస్తే విడుదలైన తర్వాత ప్రమోషన్‌కి కూడా ఆమె రాలేదని, కనీసం ఆమెకు కృతజ్ఞతాభావమే లేదని డైరెక్టర్ విమర్శించాడు. అసలు ప్రియాకు నటన రాదని, ఆమెతో హావభావాలు పలికించలేకపోయానని డైరెక్టర్ ఫైర్ అయ్యాడు.

Tags:    

Similar News