Mr.Perfect దర్శకుడు బాబీ ఇంట విషాదం

తండ్రి మరణంతో బాబీ దిగ్భ్రాంతికి గురయ్యారు. కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరవుతున్నారు. విషయం తెలిసిన..;

Update: 2022-08-28 12:48 GMT

టాలీవుడ్ దర్శకుడు బాబీకి పితృవియోగం కలిగింది. దర్శకుడు బాబీ (కె.ఎస్ రవీంద్ర) తండ్రి కొల్లి మోహనరావు అనారోగ్యంతో కన్నుమూశారు. మోహనరావు కొంతకాలంగా హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో కాలేయ సంబంధిత సమస్యతో చికిత్స పొందుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు. రేపు ఆయన స్వగ్రామమైన గుంటూరు జిల్లా నాగారంపాలెంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.

తండ్రి మరణంతో బాబీ దిగ్భ్రాంతికి గురయ్యారు. కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరవుతున్నారు. విషయం తెలిసిన పలువురు సినిమా ప్రముఖులు ఫోన్ ద్వారా బాబీని పరామర్శించి, కుటుంబానికి సానుభూతిని తెలిపారు. 2011లో Mr.Perfect సినిమాతో బాబీ టాలీవుడ్ లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత బలుపు, అల్లుడు శీను, పవర్, సర్దార్ గబ్బర్ సింగ్, జై లవకుశ, పంతం, వెంకీమామ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం బాబీ మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న వాల్తేరు వీరయ్య సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.





Tags:    

Similar News