క్యూట్ గా కన్ఫర్మ్ చేసిన దర్శకుడు!!
కోలీవుడ్ లేడి సూపర్ స్టార్ నయనతార శింబు, ప్రభుదేవా లతో ప్రేమాయణానికి ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత దర్శకుడు విగ్నేష్ శివన్ తో చెట్టాపట్టాలేసుకుని తిరగడమే కాదు.. [more]
కోలీవుడ్ లేడి సూపర్ స్టార్ నయనతార శింబు, ప్రభుదేవా లతో ప్రేమాయణానికి ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత దర్శకుడు విగ్నేష్ శివన్ తో చెట్టాపట్టాలేసుకుని తిరగడమే కాదు.. [more]
కోలీవుడ్ లేడి సూపర్ స్టార్ నయనతార శింబు, ప్రభుదేవా లతో ప్రేమాయణానికి ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత దర్శకుడు విగ్నేష్ శివన్ తో చెట్టాపట్టాలేసుకుని తిరగడమే కాదు.. ఏకంగా సహజీవనం చేస్తుంది. విగ్నేష్ బర్త్ డే లకు నయనతార విగ్నేష్ కి విదేశాల్లో సర్ప్రైజ్ చెయ్యడం, నయనతార పుట్టినరోజున విదేశాల్లో పార్టీలు చేసుకోవడం అబ్బో యవ్వారం మాములుగా లేదు. అయితే గత నెల రోజులుగా విగ్నేష్ తో నయనతార బ్రేకప్ అయినట్లుగా సోషల్ మీడియాలోనూ, కోలీవుడ్ మీడియాలోనూ న్యూస్ వినబడుతుంది.
అయితే తాజాగా విగ్నేష్ శివన్ మాతృ దినోత్సవం రోజున నయనతార తో తన పెళ్లిపై ఇచ్చిన క్లారిటీ మాములుగా లేదు. నయనతార ఓ బాబు ని ఎత్తుకున్న ఫోటో ని పోస్ట్ చేస్తూ నా పిల్లలకు జన్మనివ్వబోయే తల్లి చేతుల్లో ఉన్న పాప తల్లికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చెయ్యడంతో నయనతార – విగ్నేష్ ల పెళ్లి పై పక్కా క్లారిటీ వచ్చేసింది. మరి విగ్నేష్ కూడా నయనతార తో తన పెళ్లిపై ఇలా డైరెక్ట్ గా చెప్పడంతో.. పెళ్లి ఎప్పుడు అంటూ అభిమానులు సోషల్ మీడియాలో అడుగుతున్నారు. మరి పెళ్లి అంటే భయపడే నయనతార ని మానసికంగా విగ్నేష్ పెళ్ళికి సిద్ధం చేసి ఉంటాడు అందుకే ధైర్యంగా తమ పెళ్ళైపై ఇలాంటి ప్రకటన చేసాడంటున్నారు.