నేను కూడా మారాలా ? : క్రిష్

క్రిష్ సినిమాల్లో మానవ సంబంధాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఇప్పుడున్న రోజుల్లో అటువంటి కథలు ఓకే కానీ వసూళ్లే అసలు రావడం లేదు. మొదటి సినిమా నుండి [more]

Update: 2019-01-24 07:43 GMT

క్రిష్ సినిమాల్లో మానవ సంబంధాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఇప్పుడున్న రోజుల్లో అటువంటి కథలు ఓకే కానీ వసూళ్లే అసలు రావడం లేదు. మొదటి సినిమా నుండి క్రిష్ ఏదో కొత్తగా తీద్దాం అనే ఉదేశంతోనే తీసిన సినిమాలు… గ‌మ్యం, వేదం, క్రిష్ణం వందే జ‌గ‌ద్గురుమ్‌, కంచె, గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి అన్ని ఇటువంటి బాపతే. ఈ సినిమాలకి పేరు వచ్చింది కానీ వసూళ్లు మాత్రం అంతగా రాలేదు. ఒక్క గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణికి మాత్ర‌మే డబ్బులు వచ్చాయి. గ‌మ్యం.. త‌న బ‌డ్జెట్‌కి న్యాయం చేసింది. వేదం, కృష్ణం వందే, కంచె… ఇవ‌న్నీ నిర్మాత‌ల‌కు న‌ష్టాల‌నే మిగిల్చాయి.

వసూళ్లు రాకపోవడంతో…

ఇంకా ఎన్టీఆర్ కథానాయకుడు గురించి అయితే వేరే చెప్పనవసరం లేదు. క్రిష్ కెరీర్ లోనే ఇది మొదటి డిజాస్టర్ గా నిలిచింది. వ్యాపార సూత్రాలు, క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌కు దూరంగా సాగుతాయి క్రిష్ సినిమాలు. కాకపోతే క్రిష్ తీసిన సినిమాలన్నీ దాదాపుగా స్వీయ నిర్మాణంలోనే. ప్రస్తుతం క్రిష్ వాటిని దాటుకుని డబ్బులు వచ్చే సినిమాలు తీయాలి. లేకపోతే కెరీర్ పై ఎఫెక్ట్ పడుతుంది. ఇదే అతన్ని పున‌రాలోచ‌న‌లో పడినట్టు సమాచారం. క్రిష్ తన స్నేహితుల దగ్గర మంచి సినిమాలు తీస్తున్నా.. డబ్బులు ఎందుకు రావడం లేదు.. నేను కూడా మారాలా అని అంటున్నాడట. మరోపక్క క్రిష్ డైరెక్ట్ చేసిన రెండు సినిమాలు వచ్చే నెలలో రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాల రిజల్ట్ తేడా కొడితే తన స్టైల్ మార్చే అవకాశాలు లేకపోలేదు.

Tags:    

Similar News