డైరెక్టర్ క్రిష్ ను ఎన్ని గంటలు విచారించారంటే?

గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో దర్శకుడు క్రిష్‌కు సమన్లు ​​అందాయి

Update: 2024-03-03 12:13 GMT

గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో దర్శకుడు క్రిష్‌కు సమన్లు ​​అందాయి. గత కొద్దిరోజులుగా విచారణకు క్రిష్ దూరంగా ఉంటూ వచ్చారు. ఎట్టకేలకు విచారణకు హాజరయ్యారు. గచ్చిబౌలి పోలీసులు క్రిష్ ను నాలుగు గంటలకు పైగా ప్రశ్నించారు. విచారణ అనంతరం క్రిష్ రక్తం, మూత్ర నమూనాలను సేకరించారు. మూత్ర పరీక్షలో క్రిష్ నెగెటివ్ అని తేలింది. రక్త పరీక్ష ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. రక్త పరీక్షల్లోనూ నెగెటివ్‌ వస్తే ఆయనను సాక్షిగా భావించి.. విచారిస్తారు.

ప్రస్తుతం ఈ కేసులో గచ్చిబౌలి పోలీసులు 12 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారిలో క్రిష్ ఒకరు. తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని దర్శకుడు క్రిష్ కొట్టిపారేశాడు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. కేసుకు సంబంధించి అన్ని వివరాలను సమర్పించాలని గచ్చిబౌలి పోలీసులను హైకోర్టు కోరింది. తదుపరి విచారణను మార్చి 4న వాయిదా వేసింది.


Tags:    

Similar News