తొలి సినిమాతోనే నంది అవార్డు అందుకున్న విశ్వనాథ్

ఈ తరంవారు ఆ సినిమా చూసినా.. ఇప్పటికీ విసుగు తెప్పించని రీతిలో ఉంటుంది. అక్కినేని, కాంచన, రాజశ్రీలతో ..;

Update: 2023-02-03 03:47 GMT

vishwanath movies

తెలుగు సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. అగ్రహీరోలు, సీనియర్ నటులు సహా దర్శకులను కోల్పోతోంది. వరుస మరణాలతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. గతరాత్రి దిగ్గజ దర్శకుడు, కళాతపస్విగా పేరొందిన కాశీనాథుని విశ్వనాథ్‌(92) శివైక్యం చెందారు. కాగా.. ఆయన తీసిన సినిమాలే.. ఆయనకు కళతపస్విగా పేరు తెచ్చిపెట్టాయి. ఆయన తీసిన సినిమాలు ప్రేక్షకుల ముందు చెక్కిన శిల్పాల్లా కొలువుదీరాయంటే అతిశయోక్తి కాదు.

వాహిని స్టూడియోస్ లో సౌండ్ ఆర్టిస్ట్ గా చేరి.. దర్శకుడిగా మారిన కాశీనాథుని విశ్వనాథ్ తొలిసినిమాతోనే నందిఅవార్డు అందుకున్నారు. 1963లో తీసిన ఆత్మగౌరవం సినిమాతోనే ఆయనేంటో నిరూపించుకున్నారు. ఈ తరంవారు ఆ సినిమా చూసినా.. ఇప్పటికీ విసుగు తెప్పించని రీతిలో ఉంటుంది. అక్కినేని, కాంచన, రాజశ్రీలతో రైతు కుటుంబం నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాలో రెండు పాటలతో అసలైన శృంగారం అంటే ఏంటో చూపించారు. అవే "అందెను నేడే అందని జాబిల్లి", "రానని.. రాలేనని ఊరక అంటావు" పాటలు ఆల్ టైమ్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమాతో విశ్వనాథ్ నంది అవార్డుని అందుకున్నారు.


Tags:    

Similar News