వాల్తేరు వీరయ్య సెట్ లో ఈ ఇద్దరు సెలబ్రిటీల బర్త్ డే సెలబ్రేషన్స్
చిరంజీవి నటిస్తోన్న మరో సినిమా భోళాశంకర్ కు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళంలో అజిత్ నటించిన వేదాళం మూవీకి..;
టాలీవుడ్ మెగాస్టార్.. గాడ్ ఫాదర్ సినిమాతో.. తెలుగు ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్ గా మారారు. తాజాగా చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న మరో సినిమా వాల్తేరు వీరయ్య. బాబీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతిహాసన్ నటిస్తుండగా.. రవితేజ ప్రతినాయకుడిగా కనిపించనున్నట్లు టాక్. ఇటీవలే మూవీ టైటిల్ టీజర్ విడుదలైన విషయం తెలిసిందే. దాంతో సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
కాగా.. ఈ సినిమాలో ఓ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. నేడు (నవంబర్ 6) శేఖర్ మాస్టర్, మెహర్ రమేశ్ ల పుట్టినరోజు కావడంతో.. వీరయ్య సెట్ లో ఆ ఇద్దరి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో చిరంజీవితో పాటు దర్శకుడు బాబీ, యాక్టర్ సత్యదేవ్, గెటప్ శీను, సప్తగిరి తదితరులు పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మూవీ టీంకి కృతజ్ఞతలు తెలిపాడు డైరెక్టర్ మెహర్ రమేష్.
చిరంజీవి నటిస్తోన్న మరో సినిమా భోళాశంకర్ కు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళంలో అజిత్ నటించిన వేదాళం మూవీకి ఇది రీమేక్. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ చిరుకి చెల్లిగా కనిపించబోతుంది. మణిశర్మ తనయుడు 'మహతి స్వర సాగర్' ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి భోళాశంకర్, సంక్రాంతికి వాల్తేరు వీరయ్య తో మెగాస్టార్ అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.