వైరల్ ఫీవర్ తో రాజమౌళి?
దర్శకుడు రాజమౌళి అస్వస్థతకు గురయ్యారు. ఆయన గత కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు.
దర్శకుడు రాజమౌళి అస్వస్థతకు గురయ్యారు. ఆయన గత కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. అయినా ఆయన ట్రిపుల్ ఆర్ చిత్రం ప్రమోషన్ కోసం వచ్చారు. తనకు బాగా లేకపోయినా జనని సాంగ్ రిలీజ్ సమయంలో పాల్గొన్నారు. విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధనం కూడా రాజమౌళి ఇచ్చారు.
అయినా...?
అయితే సామాన్య జ్వరమేనని, దీనికి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాజమౌళి సన్నిహితులు చెబుతున్నారు. బాగా లేకపోయినా ఆయన ట్రిపుల్ ఆర్ ప్రమోషన్ కోసం వచ్చారని, అది ఆయనకు సినిమా పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేస్తుందని చెబుతున్నారు.