విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత

ప్రముఖ సినీ దర్శకుడు కేఎస్ సేతు మాధవన్(90) శుక్రవారం ఉదయం చెన్నైలోని తన స్వగృహంలో అనారోగ్యంతో కన్నుమూశారు.

Update: 2021-12-24 06:49 GMT

ప్రముఖ సినీ దర్శకుడు కేఎస్ సేతు మాధవన్(90) శుక్రవారం ఉదయం చెన్నైలోని తన స్వగృహంలో అనారోగ్యంతో కన్నుమూశారు. 1961లో డైరెక్టర్‌గా చిత్రసీమలోకి అడుగుపెట్టిన సేతు మాధవన్ 60చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన సినిమాలకు చేసిన కృషికి గాను 10 జాతీయ చలనచిత్ర అవార్డులతో పాటు.. 9 కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు వరించాయి. ఆయన తమిళ చిత్రం 'మారుపక్కం'లో శివ కుమార్, రాధ జంటగా నటించారు. ఈ చిత్రం 1991లో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ అవార్డును అందుకుంది. దర్శకుడు కె. ఎస్ సేతుమాధవన్ 1962 మలయాళ చిత్రం 'కన్నుమ్ కరాలుమ్‌'లో కమల్ హాసన్‌ను చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయం చేశారు. దర్శకుడు కేఎస్ సేతు మాధవన్ మృతి పట్ల కమల్ హాసన్ ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు.

గ్రాడ్యుయేషన్ చేసి.. సినిమాల్లోకి

కెఎస్ సేతుమాధవన్ 1931 మే 15న జన్మించిన సేతు మాధవన్..జీవశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత దర్శకుడిగా నిలదొక్కుకున్నారు. ఆయన హిందీ, తమిళం, తెలుగు భాషల్లో చిత్రాలకు దర్శకత్వం వహించారు. మొదట రామ్ నాథ్ దగ్గర కో డైరెక్టర్ గాని పనిచేసిన ఆయన.. ఆ తర్వాత ఎల్వీ ప్రసాద్, ఏఎస్ఏ స్వామి, సుందర్ రావు, నందకర్ణి వంటి దర్శకులతో కలిసి పనిచేశారు. కెఎస్ సేతుమాధవన్ 1960లో తన మొదటి చిత్రం 'సింఘాలీస్‌'లో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత 60 సినిమాలకు దర్శకత్వం వహించారు. 1995 నుండి దర్శకత్వానికి దూరంగా ఉన్నారు. సేతు మాధవన్ మృతి పట్ల మాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు, నటీనటులు సంతాపం ప్రకటించారు.

Tags:    

Similar News