మహర్షి ఫెయిల్ అయితే వంశీయే కారణం..!
మరో నాలుగు రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ 25వ చిత్రం ‘మహర్షి’ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం [more]
మరో నాలుగు రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ 25వ చిత్రం ‘మహర్షి’ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం [more]
మరో నాలుగు రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ 25వ చిత్రం ‘మహర్షి’ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం అని డైరెక్టర్ దగ్గర నుండి ప్రొడ్యూసర్స్ వరకు అందరూ నమ్ముతున్నారు. అయితే డైరెక్టర్ వంశీ పైడిపల్లికి ఓ చెడ్డ పేరు ఉంది. అవసరానికి మించి ఖర్చు చేస్తాడు అని ఇండస్ట్రీలో ఆయనకు చెడ్డ పేరు ఉంది. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా స్టార్టింగ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టైంలో మున్నాతో ఫ్లాప్ ఇచ్చాడు వంశీ పైడిపల్లి.
ప్రభాస్ మార్కెట్ కి మించి ఖర్చు పెట్టడంతో అది అప్పట్లో పెద్ద ఫ్లాపయింది. ఇక మూడేళ్ల కిందట నాగ్ తో ‘ఊపిరి’ చిత్రం చేసిన వంశీ.. టాక్ పరంగా సక్సెస్ అయినా ఆ చిత్రం ఫెయిల్యూర్ అయింది.
బడ్జెట్ వల్లే ఇబ్బందులు…
ఆ నష్టాల వల్లే ప్రొడ్యూసర్ పీవీపీ ‘మహర్షి’ సినిమాకి భాగస్వామిగా ఉన్నాడు. ‘ఊపిరి’కి కూడా అవసరానికి మించి ఎక్కువ ఖర్చు పెట్టడంతో ఇలా జరిగింది. ఇక ‘మహర్షి’ చిత్రానికి అయితే దాదాపు 130 కోట్లు ఖర్చు చేసినట్టు అర్ధం అవుతుంది. మూవీకి మంచి బిజినెస్ జరిగినప్పటికీ నిర్మాతలకి లాభాలే రాలేదట. హిట్ అయితే ఏమైనా లాభాలు ప్రొడ్యూసర్స్ కి వచ్చే అవకాశం ఉంది కానీ లేకపోతే కష్టమే అంటున్నారు. పైగా ఇంత కలెక్ట్ చేయాలంటే సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవ్వాలి. బడ్జెట్ ని కంట్రోల్ చేయకపోతే ఎన్ని ఉత్తమ చిత్రాలు తీసినా లాభం లేదనేది ట్రేడ్ మాట.