నేను కాదు బాబోయ్ అరెస్ట్ అయ్యింది అంటున్నాడు!!

జబర్దస్త్ లో హైపర్ అది స్కిట్స్ లో కామెడీ చేసే దొరబాబు.. యూట్యూబ్ లో సెక్స్ వీడియోస్ తో తెగ పాపులర్ అనే విషయం ఆది ప్రతి [more]

Update: 2020-03-05 12:25 GMT

జబర్దస్త్ లో హైపర్ అది స్కిట్స్ లో కామెడీ చేసే దొరబాబు.. యూట్యూబ్ లో సెక్స్ వీడియోస్ తో తెగ పాపులర్ అనే విషయం ఆది ప్రతి స్కిట్ లోను దొరబాబు మీద పంచ్ వెయ్యకుండా మానడు. హాట్ రొమాన్స్ వీడియోస్ తో బాగా పాపులర్ అయిన దొరబాబు ని.. నిన్న విశాఖలో జరిగిన సెక్స్ రాకెట్‌లో రైడ్ లో పెట్టుబడి జాలుకెళ్లాడు. కమేడియన్ గా జబర్దస్త్ లో దూసుకుపోతున్న దొరబాబు తో పాటుగా మరో నటుడు పరదేశి కూడా నిన్న విశాఖ‌లో సెక్స్ రాకెట్‌లో అడ్డంగా దొరికిపోయాడు. దొరబాబు, పరదేశి లు విటుల ప్లేస్ లో పోలీస్ లకు పట్టుబడ్డారు. జబర్డస్ట్ తో పేరు తెచ్చుకున్న దొరబాబు, పరదేశిలను చూడగానే చాలామంది చిరాకు పడడమే కాదు.. బండబూతులు తిడుతున్నారు.

అయితే ఇప్పుడు దొరబాబు అరెస్ట్ అవడంతో.. దొరబాబు లా ఉండే మరో నటుడు వెలుగులోకొచ్చి.. నేను కాదు బాబోయ్ ఆ దొరబాబే అరెస్ట్ అయ్యాడంటూ నెత్తినోరు బాదుకుంటున్నాడు. దొరబాబు పోలికలతో ఉండే దావుద్ అనే నటుడు దొరబాబుతో కలిసి కవల సోదరులుగా హైపర్ ఆది స్కిట్ లో నటించాడు. అంతే కాకుండా దావుద్ అనేక సినిమాల్లో కేరెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేశాడు. చూడడానికి అచ్చం దొరబాబులా ఉండే దావుద్.. ఇపుడు దొరబాబు అరెస్ట్ వలన కష్టాల్లో పడ్డాడు. దొరబాబు అరెస్ట్ అవడంతో చాలామంది దావుద్ కి ఫోన్స్ చేసి బండబూతులు తిడుతున్నారట. దానితో దావుద్ మీడియా ముందుకు వచ్చి… నేను కాదు అరెస్ట్ అయ్యింది.. జబర్దస్త్ దొరబాబు అంటూ నెత్తి నోరు కొట్టుకుంటున్నాడు. చూడడానికి ఒకేలా ఉండడంతో అందరూ తానే అరెస్ట్ అయ్యా అనుకున్నారని, దొరబాబు విషయంలో ఏం జరుగుతుందో అని అందరిలా తానూ ఎదురు చూస్తున్న అని, మేమిద్దరం ఒకేలా ఉంటాం కాబట్టి.. త్వరగా ఫ్రెండ్స్ అయ్యాము, దొరబాబు విషయంలో ఇలా జరగడం బాధాకరంటూ.. దొరబాబుకి మంచే జరగాలని కోరుకుంటూ అందరికి ధన్యవాదాలు తేలిపాడు..

Tags:    

Similar News