ఈ వారం ఏకంగా 8 సినిమాలు రిలీజ్.. ఆ రెండింటిపైనే ఆసక్తి !
ఆ తర్వాతి స్థానంలో కిరణ్ అబ్బవరం నటించిన.. 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' ఉంది. మూడో స్థానంలో శాకిని -ఢాకిని సినిమా..
ఈ వారం థియేటర్లలో విడుదలయ్యే సినిమాల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది. రెండు, మూడు కాదు.. ఏకంగా 6 తెలుగు సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. సెప్టెంబర్ 16న 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', 'నేను మీకు బాగా కావాల్సినవాడిని', 'శాకిని డాకిని' .. 'సకల గుణాభిరామా' .. నేను నువ్వు' .. 'అం అః' సినిమాలు థియేటర్లలో దిగుతున్నాయి. వీటిలో సుధీర్ - కృతిశెట్టి జంటగా తెరకెక్కిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాపై అంచనాలున్నాయి.
ఆ తర్వాతి స్థానంలో కిరణ్ అబ్బవరం నటించిన.. 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' ఉంది. మూడో స్థానంలో శాకిని -ఢాకిని సినిమా ఉంది. ఇక మిగతా సినిమాల గురించి కనీసం మౌత్ టాక్ కూడా లేదు కాబట్టి.. ప్రేక్షకుల దృష్టికి అవి పెద్దగా రాలేదనే చెప్పాలి. పైగా ఆ సినిమాల దర్శక, నిర్మాతల గురించి కూడా చాలామందికి తెలియదు. కాగా.. గురు, శుక్రవారాల్లో అనువాద చిత్రాలు విడుదలవుతున్నాయి. తమిళ అనువాదంగా శింబు 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' సినిమా 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక శుక్రవారం రోజునే కన్నడ అనువాదంగా సుదీప్ 'K3 కోటికొక్కడు' సినిమా బరిలోకి దిగుతోంది. మరి వీటిలో ఏవి హిట్టవుతాయి. ఏవి ఫట్టవుతాయి తెలియాలంటే శుక్రవారం వరకూ ఆగాల్సిందే.