లాభాల పంట పండించిన మూడు సినిమాలివే..!

బాహుబలి సినిమా తరువాత మన టాలీవుడ్ మార్కెట్ ఓపెన్ అయిపోయిందని అందరికీ తెలిసిన విషయమే. ఈ చిత్రం తరువాత కలెక్షన్లపరంగా భారీ లాభాలు తెచ్చిపెట్టిన సినిమాలు ఏంటో [more]

Update: 2019-02-01 06:50 GMT

బాహుబలి సినిమా తరువాత మన టాలీవుడ్ మార్కెట్ ఓపెన్ అయిపోయిందని అందరికీ తెలిసిన విషయమే. ఈ చిత్రం తరువాత కలెక్షన్లపరంగా భారీ లాభాలు తెచ్చిపెట్టిన సినిమాలు ఏంటో చూద్దాం. మొదట ఈ లిస్ట్ లో రామ్ చరణ్ నటించి సుకుమార్ డైరెక్ట్ చేసిన రంగస్థలం ఉంది. ఈ సినిమా గత ఏడాది రిలీజై 200 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. 80 కోట్లు బిజినెస్ జరుపుకుని 120 కోట్లు పైగా షేర్ ను రాబట్టి 40 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.

గీత గోవిందం… ఎఫ్ 2…

రెండో సినిమా విజయ్ దేవరకొండ – రష్మిక కాంబో లో వచ్చిన గీత గోవిందం. ఈ సినిమా గత ఏడాది విడుదలై 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషనల్ హిట్ అయ్యింది. 70 కోట్లు షేర్ రాబట్టి విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక మూడో చిత్రం ఈ ఏడాది మొదట్లో సంక్రాంతికి రిలీజైన ఎఫ్ 2. వరుణ్ – వెంకీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచి 70 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. అయితే ఎఫ్ 2 చిత్రం ఫుల్ రన్ లో రంగస్థలం, గీత గోవిందం రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ వర్గాలు.

Tags:    

Similar News