Game Changer: మెగా త్యాగం.. గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్

Update: 2024-10-12 13:11 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సీజన్ తెలుగు సినిమాకి అతిపెద్దది కాబట్టి మంచి రిలీజ్ ప్లానింగ్ అని చెప్పొచ్చు. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి రిలీజ్ డేట్ ఎప్పుడా అనే కన్ఫ్యూజన్ లో నిర్మాతలకు ఎట్టకేలకు రిలీజ్ డేట్ దొరికింది. అయితే గేమ్ ఛేంజర్ రిలీజ్ కు మెగా త్యాగం కారణమని అంటున్నారు. గేమ్ ఛేంజర్‌ విడుదలకు చిరంజీవి విశ్వంభర బృందం హెల్ప్ చేసింది. విశ్వంభర సినిమా విడుదల సంక్రాంతికి అనే చెప్పారు. అయితే ఆ సినిమా రిలీజ్ డేట్ మారడంతో గేమ్ ఛేంజర్ సంక్రాంతికి భారీ ఎత్తున విడుదల కాబోతోంది. విశ్వంభర చిత్రాన్ని తొలుత సంక్రాంతికి జనవరి 10న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు మేకర్స్‌. చిత్ర షూటింగ్‌తో పాటు నిర్మాణానంతర పనులు, ముఖ్యంగా వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ పెండింగ్‌లో వున్న కారణంగా విశ్వంభర విడుదలను వాయిదా వేశారు.

గేమ్ ఛేంజర్ చిత్రాన్ని సంక్రాంతి బరిలో జనవరి 10న విడుదల చేస్తున్నట్లుగా నిర్మాత దిల్‌రాజు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. సంక్రాంతి బరిలో విశ్వంభర స్థానంలో గేమ్‌ ఛేంజర్‌ రాబోతోంది.


Tags:    

Similar News