బరువు తగ్గడానికి

నా పేరు సూర్య అప్పుడు బాగా ఫిట్ గా ఉన్న అల్లు అర్జున్.. ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ రావడంతో కాస్త బరువు పెరిగాడు. అయితే త్రివిక్రమ్ [more]

Update: 2019-10-21 10:12 GMT

నా పేరు సూర్య అప్పుడు బాగా ఫిట్ గా ఉన్న అల్లు అర్జున్.. ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ రావడంతో కాస్త బరువు పెరిగాడు. అయితే త్రివిక్రమ్ తో అల వైకుంఠపురములో సినిమా అప్పటికి అల్లు అర్జున్ కాస్త వెయిట్ పెరిగాడట. తన బరువు తగ్గించుకోవడానికి అల్లు అర్జున్ చాలా కష్టపడినట్లుగా టాక్. జిమ్ ట్రైనర్ ఆధ్వర్యంలో కష్టతరమైన వర్కౌట్స్ చెయ్యడమే కాకుండా కీటో డైట్‌ ఫాలో అయినట్లుగా చెబుతున్నారు. దాదాపు 4 నెలల పాటు బన్నీ డైట్ ని ఫాలో అవడంతో చాలా వెయిట్ తగ్గాడట.

నాలుగు నెలల్లోనే…

చాలా రోజులు కాదు నెలల పాటు కార్బోహైడ్రేట్లు ఉన్న ఫుడ్డే అల్లు అర్జున్ తీసుకోలేదట. కేవలం 4 నెలల్లోనే బన్నీ 10 నుంచి 14 కిలోల బరువు తగ్గి అల వైకుంఠపురములో సినిమా కోసం ఫిట్ గా న్యూ లుక్ లోకి మారాడట. మరి అల వైకుంఠపురములో.. భారీ ప్రమోషన్స్ తో సంక్రాంతికే విడుదలవడానికి రేడి అవుతుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ మరీ కొత్త లుక్ ట్రై చెయ్యకయినా.. త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ కి సరిపోయే లుక్ లో కొత్తగా కనిపిస్తున్నాడు. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ లో బన్నీ కాస్త డిఫ్రెంట్ గానే కనబడుతున్నాడు.

 

 

Tags:    

Similar News