జెమినీ గణేశన్ కూతురు గురించి మీకు తెలుసా..? మహానటి సావిత్రి ఆమెను..!
జెమినీ గణేశన్ కూతురు గురించి మీకు తెలుసా..? అలాగే ఆమెను మహానటి సావిత్రి ఎలా చూసుకునేవారో తెలుసా..?
మహానటి సావిత్రి, తమిళ నటుడు జెమినీ గణేశన్.. వీరిద్దరి ప్రేమ, పెళ్లి విషయం అప్పుడే కాదు ఇప్పుడు కూడా హాట్ టాపికే. వారి జీవితంలో అసలు ఏం జరిగింది..? వెండితెర మహారాణి అయిన సావిత్రి ఎందుకు దీనస్థితిలో మరణించాల్సి వచ్చిందని..? అనే విషయాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని అనుకుంటారు. ఈ ఆసక్తే 'మహానటి' సినిమా వచ్చేలా చేసింది. అయితే ఆ బయోపిక్ లో జెమినీ గణేశన్ పాత్రని అవాస్తవంగా చూపించారంటూ.. ఆయన కుటుంబసభ్యులు మూవీ రిలీజ్ సమయంలో మండిపడ్డారు.
జెమినీ గణేశన్ రెండో భార్యగా ఆయన జీవితంలోకి వెళ్లిన సావిత్రి.. అనేక కష్టాలు పడినట్లు మహానటి సినిమాలో చూపించారు. ఇక దీనిపై జెమినీ గణేశన్ ఫ్యామిలీ మెంబర్స్ ఏదో సమయంలో స్పందిస్తూనే వస్తున్నారు. తాజాగా ఆయన కుమార్తె కమల సెల్వరాజ్.. మహానటి సినిమా గురించి, జెమినీ గణేశన్, సావిత్రి గురించి ఆసక్తికర విషయాలు మాట్లాడారు. ఆ మూవీలో చూపించిదంతా అవాస్తవమని కమల సెల్వరాజ్ కొట్టి పారేశారు.
సావిత్రి, జెమినీ గణేశన్ ఇద్దరు మహానటులే అని, కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇద్దరు సమస్యలు ఎదురుకున్నట్లు వ్యాఖ్యానించారు. తన తండ్రి చాలా అందంగా ఉండేవారని, ఆయన కోసం ఆడపిల్లలు క్యూ కట్టేవారని చెప్పుకొచ్చిన కమల సెల్వరాజ్.. తన తండ్రి ఏ ఆడపిల్లని పెళ్లి చేసుకోమని బలవంతం చేయలేదని పేర్కొన్నారు. పుష్పవల్లి, సావిత్రిలతో జెమినీ గణేశన్ వివాహం విధి రాత వల్ల జరిగిందని, వారిలా ఇండస్ట్రీలో చాలా మంది రహస్య వివాహాలు చేసుకున్న వారు ఉన్నారని, కాకపోతే తన తండ్రి జీవితం ఒక తెరచిన పుస్తకం అని ఆమె వ్యాఖ్యానించారు.
సావిత్రి పిల్లలు, జెమినీ గణేశన్ పిల్లలు అనే బేధం లేకుండా వీరంతా ఇప్పటికి టచ్ లోనే ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే చిన్నతనంలో సావిత్రి తమని ఎంతో బాగా చూసుకునేవారని పేర్కొన్నారు. సావిత్రితో తమకి ఎలాంటి విబేధాలు లేవని వెల్లడించారు. ఇక కమల సెల్వరాజ్ విషయానికి వస్తే.. ఆమె చెన్నైలో గొప్ప గైనకాలజిస్ట్ గా ఉన్నారు. భారతదేశంలో ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీని సృష్టించిన వైద్యురాలిగా ఆమె పేరు తెచ్చుకున్నారు.