బ్యాగ్రౌండ్ లేనివారు కష్టపడి పనిచేస్తే… !!

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుట్ ఆత్మహత్య దగ్గరనుండి.. సినిమా బ్యాగ్రౌండ్ ఉంటేనే సినిమా కెరీర్ ఉంటుంది.. లేదంటే సుశాంత్ సింగ్ వలే ఆత్మహత్యే అంటూ బాలీవడో [more]

Update: 2020-07-04 05:46 GMT

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుట్ ఆత్మహత్య దగ్గరనుండి.. సినిమా బ్యాగ్రౌండ్ ఉంటేనే సినిమా కెరీర్ ఉంటుంది.. లేదంటే సుశాంత్ సింగ్ వలే ఆత్మహత్యే అంటూ బాలీవడో మీడియానుండి కోలీవుడ్, టాలీవుడ్ మీడియా వరకు పలువురు నటులు గళమెత్తారు. ఏ రంగంలో అయినా కష్టపడితే కెరీర్ ఉంటుంది అంటుంది హీరోయిన్ తమన్నా.. తానూ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు తనకెవరూ గాడ్ ఫాదర్ లేరని.. అలాగే తనది సినిమా బ్యాగ్రౌండ్ కూడా కాదని.. కనీసం భాష కూడా రాదని, అలాగే ఇండస్ట్రీలో తనకెవరూ స్నేహితులు కూడా లేరని.. అయినా కానీ కష్టపడి పని చేశాను కాబట్టే ఇక్కడ నిలదొక్కుకోగలిగాను అంటుంది.

కష్టపడి పని చేసుకుంటూనే అవకాశాలు పొందాను. అలాగే నాకు ఆయా భాష ప్రజలు నాలో ఆత్మ విశ్వాసాన్ని నింపారు. హిట్స్, ప్లాప్స్ కి కుంగిపోకుండా శక్తి సామర్ధ్యాలతో ముందుకెళ్లాను. పక్షపాతం అనేది అన్ని రంగాల్లోనూ ఉంటుంది. కేవలం సినిమా రంగంలోనే కాదు.. కానీ అది నీ జయ పజయాలను నిర్ణయించలేదు అని చెబుతుంది తమన్నా. తన ఇంట్లో అందరూ డాక్టర్స్ అంట. తాను ఈ రంగంలోకి రాకపోయి ఉంటె గనక డాక్టర్ అయ్యేదాన్ని అని చెబుతుంది.  ఒకవేళ తనకు పుట్టిన బిడ్డ నటన వైపు వస్తానంటే తన సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అని చెబుతుంది 

Tags:    

Similar News