హరిహర వీరమల్లు గ్రాఫిక్స్ ఖర్చు అన్ని కోట్లా?

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసి క్రిష్ మూవీ, అలాగే ఏకే రీమేకే షూటింగ్ లో పాల్గొనాలనుకుంటున్న టైం లో ఆయనకు [more]

Update: 2021-05-24 05:16 GMT

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసి క్రిష్ మూవీ, అలాగే ఏకే రీమేకే షూటింగ్ లో పాల్గొనాలనుకుంటున్న టైం లో ఆయనకు కరోనా రావడం నెలరోజులుగా రెస్ట్ లోనే ఉండడంతో.. ప్రస్తుతం పవన్ చెయ్యాల్సిన సినిమాలన్నీ షూటింగ్ పోస్ట్ పోన్ చేసుకున్నాయి. అయితే క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు మూవీ పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతుంది. భారీ బడ్జెట్ అంటే దాదాపు 180 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని పలు భాషల్లో రిలీజ్ కి రెడీ చేస్తున్నారు మేకర్స్.  
మొగల్ సామ్రాజ్యం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చార్మినార్, ఎర్రకోటతో పాటు మొగలాయీల సామ్రాజ్యపు ప్రాంగణాన్ని నిర్మించబోతున్నారట. చాలావరకు సెట్స్ లోనే నిర్మితమవుతున్న ఈ సినిమాకి వీఎఫెక్స్ ఎఫెక్ట్స్ హైలెట్ గా నిలవబోతున్నాయని, ఆ గ్రాఫిక్ వర్క్ కోసమే దాదాపుగా 50 కోట్లు ఖర్చుపెడుతున్నారట. చాలావరకు గ్రీన్ మ్యాట్ లోనే చిత్రీకరణ జరిగిపి వీఎఫెక్స్ లో అన్ని యాడ్ చేస్తారట. హరిహర వీరమల్లు వీఎఫెక్స్ పనులను ఇప్పటికే ఓ కంపెనీకి అప్పగించినట్టుగా తెలుస్తుంది. ఆ వీఎఫెక్స్ వర్క్ లేట్ అవుతున్నందునే క్రిష్ ఈ సినిమాని 2022 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని చెప్పాడట. కానీ ఇప్పుడు లాక్ డౌన్ తో అటు షూటింగ్, ఇటు వీఎఫెక్స్ అన్ని లేట్ అయ్యే సూచనలు ఉండడంతో రిలీజ్ డేట్ కూడా మారొచ్చనే ఊహాగానాలు బయలుదేరాయి.

Tags:    

Similar News