తండ్రికి తగ్గ తనయుడు.. ఒలిపింక్స్ రేసులో హీరో కొడుకు !

తనకొడుకుని నటుడిగా చూడటం ఇష్టం లేదన్న మాధవన్.. వేదాంత్ ఏం చేయాలనుకుంటే దానికి ఫుల్ సపోర్ట్ ఇస్తానని

Update: 2021-12-18 07:39 GMT

ప్రముఖ తమిళ హీరో కుమారుడు.. తన టాలెంట్ తో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. హీరో మాధవన్ సినిమాలతో తనకంటూ ఒక పేరును తెచ్చుకుంటే.. ఆయన కొడుకు స్విమ్మింగ్ తో ఖ్యాతి సంపాదిస్తున్నాడు. మాధవన్ కుమారుడు వేదాంత్ కు చిన్నప్పటి నుంచే స్విమ్మింగ్ అంటే ఆసక్తి ఉండటంతో.. ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని, స్విమ్మింగ్ లో రాణిస్తున్నాడు. ఇటీవల జరిగిన నేషనల్ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ లో వేదాంత్ ఏకంగా 7 పతకాలు సాధించి కొత్తరికార్డు సృష్టించాడు. త్వరలోనే తాను ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నాడు.

ఒలింపిక్స్ లో పతకమే ధ్యేయం

ఏ ఆటలో ప్రావీణ్యం ఉన్నవారైనా ఒలింపిక్స్ లో పాల్గొని పతకం సాధించాలన్న కోరిక ఉంటుంది. వేదాంత్ కి కూడా అదే ఆశ. వచ్చే ఒలింపిక్స్ లో స్విమ్మింగ్ లో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించనున్నాడు వేదాంత్. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ పొందుతున్నాడు. ఈసారి ఒలింపిక్స్ లో తన సత్తా చాటి.. భారత్ కు పతకం సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు. కానీ.. భారత్ లో ఒలింపిక్స్ స్థాయి స్విమ్మింగ్ ఫూల్స్ లేకపోవడం వేదాంత్ కు ఇబ్బందిగా మారింది. ముంబైలో ఉన్న ఒక్కగానొక్క పెద్ద స్విమ్మింగ్ పూల్స్ కూడా కరోనా కారణంగా మూతపడ్డాయి.

వేదాంత్ ట్రైనింగ్ కోసం దుబాయ్ కి..

అందుకే.. మారుడికి స్విమ్మింగ్ లో బెస్ట్ ట్రైనింగ్ ఇప్పించేందుకు మాధవన్ తన భార్య, కొడుకుతో కలిసి దుబాయ్ కి వెళ్లారు. అక్కడ ఒలింపిక్స్ స్థాయి స్విమ్మింగ్ పూల్స్ అందుబాటులో ఉండటంతో వేదాంత్ ట్రైనింగ్ తీసుకునేందుకు అనుకూలంగా ఉంటుందని, అందుకే దుబాయ్ వచ్చినట్లు మాధవన్ తెలిపారు. తనకొడుకుని నటుడిగా చూడటం ఇష్టం లేదన్న మాధవన్.. వేదాంత్ ఏం చేయాలనుకుంటే దానికి ఫుల్ సపోర్ట్ ఇస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం వేదాంత్‌ ప్రపంచ వ్యాప్తంగా స్విమ్మింగ్‌ ఛాంపియన్‌ షిప్‌లలో పతకాలు గెలుస్తున్నాడని.. త్వరలో భారత్ తరపున ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొని పతకం సాధిస్తాడని మాధవన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News