పూరికి రామ్ ఖరీదైన గిఫ్ట్..!

తొలిసారిగా రామ్ – పూరి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఇటీవల హైద్రాబాద్ లో స్టార్ట్ అయ్యింది. ‘ఇస్మార్ట్ శంకర్’ [more]

;

Update: 2019-02-05 08:38 GMT
ismart Shankar telugu post telugu news
  • whatsapp icon

తొలిసారిగా రామ్ – పూరి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఇటీవల హైద్రాబాద్ లో స్టార్ట్ అయ్యింది. ‘ఇస్మార్ట్ శంకర్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో హీరో రామ్ తెలంగాణ యాసతో ఎంటర్టైన్ చేయనున్నాడు. హీరోయిన్స్ గా నిధి అగర్వాల్, నాబా నటేష్ నటిస్తున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా హీరో రామ్ డైరెక్టర్ పూరికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడట.

nidhi agarwal in ismart shankar

ఖరీదైన కాఫీ…

ప్రపంచంలోనే అతి ఖరీదైన కాఫీ ‘కోపి లువక్’ను రామ్ పూరికి గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ ఫోటోను పూరి తన ట్విట్టర్ అకౌంట్ లో పెట్టి “ఇది ఏంటి అనేది గూగుల్ చేస్తే మీకు మతి పోతుంది” అని కామెంట్ పెట్టాడు. అటు రామ్ కూడా “ఈ గిఫ్ట్ ఏంటో గూగుల్ లో తెలుసుకోకండి తెలిస్తే మైండ్ పోతుంది” అని పెట్టాడు. పూరికి, రామ్ కి ఈ సినిమా హిట్ అవ్వడం చాలా అవసరం. అందుకే ఈ సినిమాను చాలా జాగ్రత్తగా తెస్తున్నాడు పూరి.

Tags:    

Similar News