మహర్షిలో హైలెట్ సీన్స్ ఇవే..!

మహేష్ మహర్షి మూవీ విడుదలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. వచ్చే గురువారం అంటే మే 9న విడుదల డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా మీద [more]

;

Update: 2019-05-04 12:42 GMT
maharshi movie collections
  • whatsapp icon

మహేష్ మహర్షి మూవీ విడుదలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. వచ్చే గురువారం అంటే మే 9న విడుదల డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. 140 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో బాక్సాఫీసు బరిలోకి దిగుతున్న మహర్షి మీద మేకర్స్ చాలా ఆశలే పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ కూడా వచ్చేసింది. యు/ఏ సర్టిఫికెట్ తెచ్చుకున్న మహర్షి సినిమాలో కొన్ని సన్నివేశాలు హైలెట్ గా నిలవబోతున్నాయని చెబుతున్నారు. ముందు నుండీ చెబుతున్నట్టుగా దర్శకుడు వంశీ పైడిపల్లి.. అల్లరి నరేష్ ఎపిసోడ్ తో పాటు పూజ – అల్లరి – మహేష్ మధ్యన వచ్చే స్నేహ సన్నివేశాలు అద్భుతంగా తెరకెక్కించాడని మహర్షి టీం చెబుతుంది.

కంటతడి పెట్టిస్తుందట…

అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే రామవరం ఎపిసోడ్ బాగుంటుందట. గతంలో భరత్ అనే నేను సినిమాలో మహేష్ పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ కి ఎంత పేరైతే వచ్చిందో ఇప్పుడు మహర్షి సినిమాలో మహేష్ పెట్టిన ప్రెస్ మీట్ కీ అంతే పేరొస్తుందని అంటున్నారు. ఇక నైట్ ఫైట్ సీక్వెన్స్ ఈ చిత్రానికి ఆయువు పట్టుగా నిలుస్తాయట. అలాగే నిర్మాత దిల్ రాజు చెప్పినట్టుగా క్లైమాక్స్ కూడా చాలా ఎమోషనల్ గా ఉండి కంటతడి పెట్టిస్తుందని… మహర్షికి క్లైమాక్స్ కూడా బలమంటున్నారు. మరి ఇన్ని హైలెట్స్ తో విడుదల కాబోతున్న మహర్షి లో విషయమెంతుందో మే 9న తెలిసిపోతుంది.

Tags:    

Similar News