పెళ్ళైన కొత్తల్లో భయపడ్డా అంటున్న మెగా కోడలు!!
మెగా కోడలు ఉపాసన ఇప్పుడు అటు చిరు ఫ్యామిలీని, ఇటు కామినేని ఫ్యామిలీని రెండింటిలోనూ తన పాత్ర పర్ఫెక్ట్ గా పోషిస్తుంది. భర్త రామ్ చరణ్ కి [more]
మెగా కోడలు ఉపాసన ఇప్పుడు అటు చిరు ఫ్యామిలీని, ఇటు కామినేని ఫ్యామిలీని రెండింటిలోనూ తన పాత్ర పర్ఫెక్ట్ గా పోషిస్తుంది. భర్త రామ్ చరణ్ కి [more]
మెగా కోడలు ఉపాసన ఇప్పుడు అటు చిరు ఫ్యామిలీని, ఇటు కామినేని ఫ్యామిలీని రెండింటిలోనూ తన పాత్ర పర్ఫెక్ట్ గా పోషిస్తుంది. భర్త రామ్ చరణ్ కి తోడుగా… చిరు ఫ్యామిలి తలలో నాలుకగా.. అపోలో హాస్పిటల్ లో తన వంతు బాధ్యతగా పని చేసే ఉపాసన రామ్ చరణ్ ని పెళ్లి చేసుకున్న కొత్తల్లో చాలా లావుగా ఉండేది. ఎంత ఆస్థి ఉన్నా.. రామ్ చరణ్ బండ అమ్మాయి ఉపాసనని పెళ్లి చేసుకోవడం మెగా ఫాన్స్ కె రుచించలేదు. అంత లావుగా ఉండే ఉపాసన మూడేళ్ళ క్రితం బాగా డైటింగ్, ఎక్సర్ సైజెస్ చేసి సన్నబడడమే కాదు… సన్నగా ఉండి.. ఆరోగ్యంగా ఉండాలనుంటే ఎలాంటి పోషకాహారం తీసుకోవాలో, ఎలాంటి వర్కౌట్స్ చెయ్యాలో ఉపాసన సోషల్ మీడియా ద్వారా చెబుతుంది.,
అయితే తాజాగా ఉపాసన తాను పెళ్ళైన కొత్తల్లో చాలా భయపడే దాన్ని అని, రామ్ చరణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ.. చిరు ఫ్యామిలీ మొత్తం తెలిసిఉన్నప్పటికీ.. ఉపాసన చిరు ఇంట్లోకి అడుగుపెట్టిన కొత్తల్లో కాస్త భయపడేదట. పెళ్ళైన కొత్తల్లో అత్తారింట్లో ఏం తోచేది కాదని.. ఇంట్లో వాళ్ళు తనతో ఎలా బిహేవ్ చేస్తారో తెలియక భయపడే దాన్ని అని.. కానీ మా అత్తమ్మ సురేఖ మాత్రం తనను కూతురిలా ఆదరించింది అని, నేను ఏం చేసినా అత్తమ్మ సురేఖ అభ్యన్తరం పెట్టేది కాదని.. ఆమె నాకు వెన్నంటే ఉండేదని.. ఉమ్మడి కుటుంబం నుండి వెళ్లిన నాకు మళ్ళీ ఉమ్మడి కుటుంబం దొరకడం ఆనందంగా ఉందని చెబుతుంది ఉపాసన.