అందులో పార్ట్ కావడం నా అదృష్టం!!
హరీష్ శంకర్ దర్శకత్వంలో బాలీవుడ్ దబాంగ్ రీమేక్ గబ్బర్ సింగ్ టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. పవన్ కళ్యాణ్ – శృతి హాసన్ కాంబోలో [more]
హరీష్ శంకర్ దర్శకత్వంలో బాలీవుడ్ దబాంగ్ రీమేక్ గబ్బర్ సింగ్ టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. పవన్ కళ్యాణ్ – శృతి హాసన్ కాంబోలో [more]
హరీష్ శంకర్ దర్శకత్వంలో బాలీవుడ్ దబాంగ్ రీమేక్ గబ్బర్ సింగ్ టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. పవన్ కళ్యాణ్ – శృతి హాసన్ కాంబోలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ టాలీవుడ్ ని ఓ ఊపు ఊపింది. అయితే ఈ సినిమా విడుదలై ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శృతి హాసన్ సోషల్ మీడియాలో అభిమానులల్తో చిట్ చాట్ చేసింది. అందులో భాగంగా గబ్బర్ సింగ్ లో నటించడం తన అదృష్టమని.. తనకి సంబందించిన చాలా విషయాల్లో ఈ సినిమా మార్పు కు కారణమయ్యింది. ఇక మా నాన్న కమల్ హాసన్ తన మీద కేకలు వెయ్యడం కానీ.. చెయ్యి చేసుకోవడం కానీ ఎప్పుడూ చెయ్యలేదంటుంది.
నేను కానీ అక్షర కానీ ఏదైనా తప్పు చేస్తే నాన్న అందుకు కారణమేమిటో తెలుసుకునేవారు. నన్ను బాధపెట్టకుండా మళ్లీ ఆ తప్పు చేయొద్దు అంటూ సున్నితంగా హెచ్చరించేవారని చెప్పడమే కాదు.. తానెప్పుడూ పనిని ప్రేమిస్తా అని.. లాక్ డౌన్ ముగియగానే పని చెయ్యడానికి వెళ్ళిపోతా కానీ.. అది కూడా సురక్షితమని తెలిస్తేనే అంటుంది శృతి హాసన్. ఇక తాను దేవుడిని నమ్ముతా అని.. నమ్మకాల విషయంలో అందరి అభిప్రాయాలూ ఒకేలా ఉండవని చెబుతుంది ఈ గబ్బర్ సింగ్ భామ శృతి హాసన్.