Pushpa 2 : పుష్ప 2 ఓటీటీలో వచ్చేసిందోచ్.. చూడాలంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పుష్ప 2 ది రూల్ మూవీ ఓటీటీలో విడుదలయింది;

Update: 2025-01-30 06:16 GMT
allu arjun, sukumar, pushpa 2, OTT
  • whatsapp icon

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పుష్ప 2 ది రూల్ మూవీ ఓటీటీలో విడుదలయింది. ఈరోజు నుంచి పుష్ప 2 మూవీని ఫ్యాన్స్ ఓటీటీలో చూసేయవచ్చు. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందని తెలిపారు. ఇప్పటి వరకూ పుష్ప 2 ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ ఈ మూవీని భారీ ధర చెల్లించి సొంతం చేసుకుందని పరిశ్రమవర్గాల టాక్.

నేటి నుంచి నెట్ ఫ్లిక్స్ లో...
తెలుగు, తమిళం, మళయాళం, హిందీ భాషల్లో మాత్రమే నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. కన్నడ భాషకు సంబంధించిన స్ట్రీమింగ్ మరికొన్నిరోజులు ఆలస్యమయ్యే అవకాశముందనిచెబుతున్నారు. పుష్ప 2 సినిమా విడుదలయ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 1800 కోట్లు వసూలు చేసి అన్ని రికార్డులను ఈ మూవీ చెరిపేసింది. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ఈ మూవీతో మరింత క్రేజ్ సంపాదించుకున్నారు. దీంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కు నిజంగా ఇది తీపికబురేనంటున్నారు.


Tags:    

Similar News