వారెంట్ వచ్చింది.. కానీ అరెస్ట్ కాలేదు : జీవిత రాజశేఖర్
జోష్టర్ ఫిలిం సర్వీసెస్ సంస్థ అధినేత కోటేశ్వరరావు తాము రూ.26 కోట్ల మోసానికి పాల్పడ్డామని ఆరోపిస్తున్నారని, అవి ఏ కోట్లో
హైదరాబాద్ : ప్రముఖ సినీ నటులు జీవిత, రాజశేఖర్ దంపతులు గరుడవేగ సినిమా కోసం జోష్టర్ ఫిలిం సర్వీసెస్ నుంచి రూ.26కోట్ల అప్పు తీసుకుని ఎగవేసిందంటూ.. రెండ్రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై జీవిత స్పందించారు. తమపై వస్తున్న ఆరోపణలపై మీడియాతో మాట్లాడారు. ఓ కేసులో తమకు వారెంట్ వచ్చిన విషయం వాస్తవమే కానీ.. సమన్లు అందలేదని, అందకుండా చేశారని తెలిపారు. తాను అరెస్ట్ కాలేదని స్పష్టం చేశారు. నగరి కోర్టులో ఏడాది పై నుంచి ఈ కేసు నడుస్తుండగా.. ఇప్పుడెందుకు జోష్టర్ ఫిలిం సర్వీసెస్ వారు మీడియా ముందుకు వచ్చారో తమకు అర్థం కావట్లేదన్నారు.
గతంలో మరో కేసులోనూ తనకు వారెంట్ వచ్చిందన్న జీవిత.. ఆ కేసులో తానే గెలిచినట్లు తెలిపారు. జోష్టర్ ఫిలిం సర్వీసెస్ సంస్థ అధినేత కోటేశ్వరరావు తాము రూ.26 కోట్ల మోసానికి పాల్పడ్డామని ఆరోపిస్తున్నారని, అవి ఏ కోట్లో తమకు అర్థం కావట్లేదని జీవిత ఎద్దేవా చేశారు. కోటేశ్వరరాజు వల్ల తమ మేనేజర్లు చాలా ఇబ్బంది పడ్డారని తెలిపారు. కొందరు పనిగట్టుకొని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, సినిమా రంగానికి సంబంధించిన ఏ అంశమైన తమను లాగుతున్నారని జీవిత రాజశేఖర్ వాపోయారు.
కాగా.. ఇష్టారాజ్యంగా థంబ్ నెయిల్స్ పెట్టి.. ఫేక్ న్యూస్ పెడుతున్న యూ ట్యూబ్ ఛానళ్లను జీవిత హెచ్చరించారు. ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోకుండా.. జీవిత రాజశేఖర్ లకు సమన్లు, జోష్టర్ ఫిలిం సంస్థను మోసం చేసిన జీవిత దంపతులు.. ఇలా ఇష్టారాజ్యంగా థంబ్ నెయిల్స్ పెట్టడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. తాము తప్ప చేయలేదని, ఎక్కడికీ పారిపోలేదని స్పష్టం చేశారు.