జీవితపై సంచలన ఆరోపణలు చేసిన కోటేశ్వర్ రాజు.. డ్రగ్స్, ట్రాప్ వంటి ఎన్నో ఆరోపణలు

గరుడవేగ సినిమా చిత్రీకరణ సమయంలో జీవిత తన మామయ్య వరదరాజన్ ను తీసుకుని తమ ఇంటికి వచ్చి డబ్బు కోసం కాళ్లు ..

Update: 2022-04-25 13:52 GMT

హైదరాబాద్ : రాజశేఖర్ నటించిన గరుడవేగ చిత్ర నిర్మాణం కోసం తమ వద్ద నుంచి తీసుకున్న రూ.26 కోట్లను ఎగవేశారంటూ జోస్టర్ ఫిలిం సర్వీసెస్ సంస్థ డైరెక్టర్, గరుడవేగ నిర్మాత కోటేశ్వర్ రాజు కొద్దిరోజుల కిందట ఆరోపించారు. ఈ ఆరోపణలను జీవిత ఖండించారు. 'శేఖ‌ర్‌' సినిమా ప్రెస్‌ మీట్‌లో జీవిత‌ మాట్లాడుతూ.. సుమారు రెండు నెల‌లుగా ఈ కేసు కోర్టులో ఉందని, ఇప్పుడు వాళ్లు ప్రెస్‌మీట్ పెట్టి ఎందుకు ఇలాంటి ఆరోప‌ణ‌లు చేశారో తెలియ‌ద‌ని అన్నారు. వాళ్లు చేస్తున్న ఆరోప‌ణ‌లో ఎంత మాత్రం వాస్త‌వం లేద‌ని, అవ‌న్ని త‌ప్పుడు ఆరోప‌ణ‌లు అని అన్నారు.

మేము ఎలాంటి త‌ప్పు చేయ‌లేదు. కోర్టు తీర్పు త‌ర్వాత అన్ని వివ‌రాలు చెబుతాం. మాపై ఆరోప‌ణ‌లు చేసిన వారు చాలా త‌ప్పులు చేశార‌ని, మా దగ్గ‌ర ఆధారాలు కూడా ఉన్నాయిని జీవిత ప్రెస్‌మీట్‌లో భాగంగా చెప్పుకొచ్చారు. ఒక‌ప్పుడు `మా` ఎల‌క్ష‌న్ సంద‌ర్భంగా మా కుటుంబం పేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇలా ప‌లు సంద‌ర్భాల్లో మ‌మ్మ‌ల్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావ‌డంలేదని ఆమె అన్నారు. మా కుమార్తెల గురించి రకరకాల వార్తలను రాశారు. అవన్నీ మానసికంగా ఎంతో బాధకు గురిచేస్తున్నాయని తెలిపారు.

నేడు కోటేశ్వర్ రాజు మరోసారి మీడియా ముందుకు వచ్చారు. గరుడవేగ సినిమా చిత్రీకరణ సమయంలో జీవిత తన మామయ్య వరదరాజన్ ను తీసుకుని తమ ఇంటికి వచ్చి డబ్బు కోసం కాళ్లు పట్టుకుందని కోటేశ్వర్ రాజు ఆరోపించారు. రాజశేఖర్ కు డబ్బు అవసరం లేదని, జీవితకే డబ్బు అవసరం ఉందని అన్నారు. కుమార్తెలను అడ్డంపెట్టుకుని డబ్బు గుంజే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. నిర్మాతలను ట్రాప్ చేయడం జీవితకు అలవాటేనని, కానీ తాము లండన్ నుంచి వచ్చామని, ఆమె ట్రాప్ లో చిక్కుకోమని స్పష్టం చేశారు.
జీవిత తన చిలుక పలుకులను మీడియా ఎదుట కాకుండా, కోర్టులో పలకాలని అన్నారు. జీవిత మోసాల గురించి ఆమె మామయ్య వరదరాజన్ ఎన్నో పర్యాయాలు మా వద్ద చెప్పుకుని బాధపడ్డారని వివరించారు. రాజశేఖర్ కోసం సోదరుడి నుంచి డ్రగ్స్ తెప్పించిందని కోటేశ్వర్ రాజు సంచలన ఆరోపణలు చేశారు. డబ్బులు ఇచ్చిన రోజున మేం దేవుళ్లుగా కనిపించాం, కానీ ఇప్పుడు మాకు రావాల్సిన డబ్బులు అడుగుతుంటే మీకు ఎలా కనిపిస్తున్నామని ఆయన ప్రశ్నించారు. ఆవలిస్తే పేగులు లెక్కపెడతామని కోటేశ్వర్ రాజు హెచ్చరించారు.


Tags:    

Similar News