రజినీకాంత్‌కి జైలర్ నిర్మాత BMW కారు బహుమతి..
జైలర్ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో సినీ నిర్మాత రజినీకాంత్ కి లాభాల్లో వాటాతో పాటు ఒక BMW కారుని..
‘జైలర్’ (Jailer) సినిమాతో సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) చాలా ఏళ్ళ తరువాత బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకున్నాడు. నెల్సన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం.. మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇక కలెక్షన్స్ విషయంలో బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ సృష్టిస్తుంది. 22 రోజుల్లోనే ఈ చిత్రం రూ.625 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఈ కలెక్షన్ల జోరు ఇలాగే కొనసాగితే మరో వారం రోజులు 700 కోట్ల మార్క్ ని అందుకోవడం సందేహం లేదంటున్నారు ట్రేడ్ పండితులు.
ఇక మూవీకి ఈ రేంజ్ కలెక్షన్స్ రావడంతో నిర్మాత ఫుల్ ఖుషీలో ఉన్నాడు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని 200 కోట్ల బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశాడు. పెట్టిన పెట్టుబడికి ట్రిపుల్ రేంజ్ లో కలెక్షన్స్ రావడంతో కళానిధి.. వచ్చిన లాభాల్లో కొంత బాగాన్ని రజినీకాంత్ కూడా అందజేశాడు. రజిని ఇంటికి వెళ్లి చెక్ రూపంలో కొంత అమౌంట్ ఇచ్చినట్లు తమ సోషల్ మీడియా ద్వారా నిర్మాత తెలియజేశాడు.