కష్టాల్లో నాగ్ డైరెక్టర్?

నాగార్జునని నమ్ముకుని ఇప్పుడొక డైరెక్టర్ ఘొల్లుమంటున్నాడు. అక్కినేని కాంపౌండ్ నే నమ్ముకున్న కళ్యాణ్ కృష్ణ కి నాగార్జున చుక్కలు చూపిస్తున్నాడు. సోగ్గాడే చిన్ననాయన తరవాత బంగార్రాజు సినిమా [more]

Update: 2020-06-17 08:13 GMT

నాగార్జునని నమ్ముకుని ఇప్పుడొక డైరెక్టర్ ఘొల్లుమంటున్నాడు. అక్కినేని కాంపౌండ్ నే నమ్ముకున్న కళ్యాణ్ కృష్ణ కి నాగార్జున చుక్కలు చూపిస్తున్నాడు. సోగ్గాడే చిన్ననాయన తరవాత బంగార్రాజు సినిమా ఆశపెట్టిన నాగార్జున మల్లి ఇప్పటివరకు ఆ సినిమాని తెమలనీయడం లేదు. మధ్యలో రెండు సినిమాలు చేసిన కళ్యాణ్ కృష్ణ నాగ్ భరోసాతో మల్లి బంగార్రాజు స్క్రిప్ట్ ని మెరుగు దిద్దాడు. నాగార్జున ఇదిగోఅదిగో అనడమే కానీ.. ఇంతవరకు బంగార్రాజు గురించి మాట్లాడింది లేదు. బంగార్రాజు స్క్రిప్ట్ లో నాగార్జున సూచించిన మార్పులు చేర్పులు చేసినా.. నాగార్జున మాత్రం కరుణించడం లేదు.

బంగార్రాజు అనుకున్నాక నాగార్జున సినిమాల మీద సినిమాలు మూడో నాలుగో చేసేసాడు. కానీ కళ్యాణ్ కృష్ణ మాత్రం రెండే రెండు చేసి బంగార్రాజు స్క్రిప్ట్ మీదే కూర్చున్నాడు. నాగార్జున చేస్తున్న సినిమా పూర్తయ్యాక నాగ్ – కళ్యాణ్ కృష్ణ బంగార్రాజు మొదలవుతుంది అన్నారు. కానీ నాగార్జున ప్రవీణ్ సత్తారు సినిమా లైన్ లోకొచ్చింది. దానితో కళ్యాణ్ కృష్ణ ఇప్పుడు నాగ్ ఇలా సినిమా చేస్తామని చెప్పి.. మల్లి ఇలా వేరే డైరెక్టర్ కి కమిట్ అవడంతో  కుంగిపోతున్నాడట. నీతో సినిమా తర్వాత చేద్దామని కూడా చెప్పకుండానే ప్రవీణ్ సత్తరుకి నాగ్ ఓకె చెప్పడంపై కళ్యాణ్ కృష్ణ సన్నిహితుల దగ్గర బాధపడుతున్నాడట. అసలు నాగ్ హామీ ఇస్తే మరి కొన్నాళ్ళు వెయిట్ చేసేవాడేమో. కానీ ఇప్పుడు నాగ్ ఏం చెప్పకుండా తనని గాలికొదిలేసి.. మరో సినిమా ఒప్పుకున్నాడు. అసలు నాగ్ కోసం ఆగాలా? లేదంటే మరో మార్గం వెతుక్కోవాలి అని కళ్యాణ్ కృష్ణ ఫుల్ డైలమాలో ఉన్నాడట.

Tags:    

Similar News