బాబోయ్ కంగనా.. ఏం మాట్లాడుతున్నావ్!!
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా నోరు తెరిచింది అంటే ఎవరికో మూడినట్టే. స్టార్ హీరోలను, స్టార్ దర్శకులను, నిర్మాతలను ఎవ్వరిని లెక్క చెయ్యని కంగనా రనౌత్ తనకి [more]
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా నోరు తెరిచింది అంటే ఎవరికో మూడినట్టే. స్టార్ హీరోలను, స్టార్ దర్శకులను, నిర్మాతలను ఎవ్వరిని లెక్క చెయ్యని కంగనా రనౌత్ తనకి [more]
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా నోరు తెరిచింది అంటే ఎవరికో మూడినట్టే. స్టార్ హీరోలను, స్టార్ దర్శకులను, నిర్మాతలను ఎవ్వరిని లెక్క చెయ్యని కంగనా రనౌత్ తనకి తాను హీరోలా ఫీలవుతుంది. మొన్నటికి మొన్న సుశాంత్ సింగ్ రాజపుట్ మరణానికి బాలీవుడ్ నేపోటీజమే కారణమని, సినిమా నేపథ్యం ఉన్న వారసులపై నోరు పారేసుకున్న కంగనా తాప్సి ని బి గ్రేడ్ ఆర్టిస్ట్ గా మాట్లాడి.. మరోసారి హైలెట్ అయ్యింది. తనకి నచ్చని వారిని ఎవరిని సామాన్యంగా వదలని కంగనా ఇప్పుడు రణబీర్ కపూర్, దీపికా పదుకొనేని టార్గెట్ చేసింది.
వాళ్ళిద్దరి మీద మరీ దారుణమైన వ్యాఖ్యలు చేసింది. రన్బీర్ కపూర్ కి అమ్మాయిల పిచ్చని.. స్త్రీలోలుడని వ్యాఖ్యానించిన కంగనా దీపికా మానసిక వ్యాధిగ్రస్తురాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అమ్మాయిల వెంటపడే రణబీర్ కపూర్ ని ఎవరూ రేపిస్ట్ అనరని, అలాగే దీపికా పదుకొనె తనకు తానుగా మెంటల్ డిప్రెషన్ కి లోనై మానసిక వైద్యం తీసుకున్నట్లుగా ప్రకటించింది… అయినప్పటికీ దీపికాని ఎవరూ సైకో అని కానీ, రాక్షసి అని కానీ అనరని.. కానీ చిన్న ఫ్యామిలీ, పల్లెటూరి నుండి వచ్చేవాళ్ళకి మాత్రం ఇలాంటి పేర్లు పెడతారంటూ రణబీర్ కపూర్, దీపికా పదుకొనేలపై కంగనా నోరు పారేసుకుంది.