రాఘవేంద్రరావు కుమారుడికి తొలి విజయం

దర్శకేంద్రడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి 2004 లో “బొమ్మలాట” అనే చిత్రం తో దర్శకుడిగా మారాడు. ఈచిత్రం కి పేరు రాకపోవడంతో ఆ తరువాత సిధార్థ, [more]

Update: 2019-07-27 08:23 GMT

దర్శకేంద్రడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి 2004 లో “బొమ్మలాట” అనే చిత్రం తో దర్శకుడిగా మారాడు. ఈచిత్రం కి పేరు రాకపోవడంతో ఆ తరువాత సిధార్థ, శృతి హాసన్ హీరోహీరోయిన్లుగా “అనగనగా ఓ ధీరుడు” అనే చిత్రం తెరకెక్కించాడు. ఇది కూడా ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు. ఇక అనుష్క తో సైజు జీరో సినిమా తీసి డిజాస్టర్ అందించాడు.

ఇలా వరస సినిమాలు ప్లాప్స్ అవ్వడంతో రీసెంట్ గా బాలీవుడ్ కి వెళ్లి అక్కడ “జడ్జిమెంటల్ హై క్యా” అనే చిత్రం తీసాడు. ఈమూవీ నిన్ననే రిలీజ్ అయింది. రిలీజ్ అయినా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కంగనా రనౌత్,రాజ్ కుమార్ రావ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈసినిమా తో తొలి విజయం అందుకున్నాడు ప్రకాష్.

2004 లో డైరెక్టర్ గా తన జర్నీ స్టార్ట్ చేస్తే 2019లో “జడ్జిమెంటల్ హై క్యా చిత్రం” ద్వారా విజయం దక్కింది. అంటే ప్రకాష్ తన తొలి సక్సెస్ కోసం 15ఏళ్ళు ఎదురుచూశారన్న మాట. ఇక ఈమూవీని బాలాజీ టెలీఫిల్మ్స్ బ్యానర్ పై ఏక్తా కపూర్ నిర్మించారు.

Tags:    

Similar News